భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు తన ఆల్ట్రోజ్ సిఎన్‌జీ కోసం రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా డెలివరీలు 2023 మే నాటికి ప్రారంభమవుతాయి.
వేరియంట్స్ & డిజైన్:
దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్‌జీ నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి XE, XM+, XZ , XZ+. ఇది మొదటిసారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండే ఈ మోడల్ 'iCNG' బ్యాడ్జ్ పొందుతుంది. తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్‌లో సిఎన్‌జి ట్యాంక్స్ ఉంటాయి.
ఫీచర్స్:
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథెరెట్ సీట్లు, రియర్ AC వెంట్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటివి ఉంటాయి.
అంచనా ధర:
దేశీయ విఫణిలో ఆల్ట్రోజ్ సిఎన్‌జీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ప్రస్తుతం పెట్రోల్ మాన్యువల్ ధరలు రూ. 6.45 లక్షల నుంచి రూ. 9.10 లక్షల మధ్య ఉన్నాయి. కావున ఆల్ట్రోజ్ సిఎన్‌జీ ధరలు దాని కంటే రూ. 90వేలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నాము.
పవర్‌ట్రెయిన్:
ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్, త్రీ-సిలిండర్ ఇంజన్ కలిగి సిఎన్‌జీ మోడ్‌లో 77 హెచ్‌పి పవర్ 97 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 86 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము.
సేఫ్టీ ఫీచర్స్:
టాటా మోటార్స్ ఇతర వాహనాలలో మాదిరిగానే ఆల్ట్రోజ్ సిఎన్‌జీలో కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. కావున ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment