Altroz
-
హైదరాబాద్ మార్కెట్లో టాటా అల్ట్రోజ్ ఐసీఎన్జీ.. ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అల్ట్రోజ్ ఐసీఎన్జీ వర్షన్‌ను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్ ధర ఎక్స్‌షోరూంలో రూ.7.55 లక్షల నుంచి రూ.10.55 లక్షల వరకు ఉంది. ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో ఆరు వేరియంట్లలో ఇది రూపుదిద్దుకుంది. ట్విన్ సిలిండర్లను భద్రతా కారణాల దృష్ట్యా లగేజ్ ఏరియా కింద ఏర్పాటు చేసినట్టు కంపెనీ తెలిపింది. ఇంధనం నింపే సమయంలో ఇంజన్ ఆఫ్ అవుతుంది. నిర్దిష్ట స్థాయిని మించి ఇంజన్ వేడెక్కితే సీఎన్జీ సరఫరా నిలిచిపోవడమేగాక గ్యాస్‌ను గాలిలోకి వదులుతుంది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఎనమిది స్పీకర్లతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, ఆన్‌డ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి హంగులు ఉన్నాయి. -
అప్పుడే మొదలైన 'టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ' బుకింగ్స్ - పూర్తి వివరాలు
భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు తన ఆల్ట్రోజ్ సిఎన్జీ కోసం రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాగా డెలివరీలు 2023 మే నాటికి ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & డిజైన్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జీ నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి XE, XM+, XZ , XZ+. ఇది మొదటిసారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండే ఈ మోడల్ 'iCNG' బ్యాడ్జ్ పొందుతుంది. తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్లో సిఎన్జి ట్యాంక్స్ ఉంటాయి. ఫీచర్స్: ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథెరెట్ సీట్లు, రియర్ AC వెంట్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వంటివి ఉంటాయి. అంచనా ధర: దేశీయ విఫణిలో ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ప్రస్తుతం పెట్రోల్ మాన్యువల్ ధరలు రూ. 6.45 లక్షల నుంచి రూ. 9.10 లక్షల మధ్య ఉన్నాయి. కావున ఆల్ట్రోజ్ సిఎన్జీ ధరలు దాని కంటే రూ. 90వేలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నాము. పవర్‌ట్రెయిన్: ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్, త్రీ-సిలిండర్ ఇంజన్ కలిగి సిఎన్జీ మోడ్‌లో 77 హెచ్‌పి పవర్ 97 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 86 హెచ్‌పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము. సేఫ్టీ ఫీచర్స్: టాటా మోటార్స్ ఇతర వాహనాలలో మాదిరిగానే ఆల్ట్రోజ్ సిఎన్జీలో కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ అందిస్తుంది. కావున ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
TATA Altroz: అప్డేట్ అయ్యింది.. అదిరిపోయే ఫీచర్లు తెచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆ్రల్టోజ్ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.09 లక్షల నుంచి రూ.9.89 లక్షల వరకు ఉంది. యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీతో వెట్ క్లచ్, మెషీన్ లెర్నింగ్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం, ఆటో పార్క్ లాక్, ఆటో హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల టచ్ స్క్రీన్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనుకవైపు ఏసీ వెంట్స్ వంటి హంగులు ఉన్నాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది తయారైంది. ‘సెగ్మెంట్–ఫస్ట్ ఫీచర్లతో ఆల్ట్రోజ్ డీసీఏ కచ్చితంగా కాబోయే కొనుగోలుదార్ల మనసును దోచుకుంటుంది. అడ్డంకులు లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ తెలిపారు. కంపెనీ మార్కెట్ వాటాను విస్తరించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు. దేశంలో ఇప్పటికే 1.25 లక్షల మందికిపైగా కస్టమర్లు ఆ్రల్టోజ్ వినియోగిస్తున్నారు. -
సరికొత్తగా టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వేరియంట్..!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ తన టాటా ఆల్ట్రోజ్ మోడల్ కారులో మరో కొత్త వేరియంట్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల టాటా ఆల్ట్రోజ్ డీసిటీ కారు ధరను 21 మార్చి, 2022న వెల్లడించనున్నట్లు ప్రకటించింది. త్వరలో రాబోయే ఈ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆటోమేటిక్ గేర్ బాక్స్ సహాయంతో పనిచేయనుంది. ఇప్పటికే ఈ కారుకి సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసింది. ₹21,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి టాటా ఆల్ట్రోజ్ ఏటీ కార్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ప్రస్తుతం, ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు గరిష్టంగా 85 బిహెచ్పి పవర్ అవుట్ పుట్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్'తో పని చేయనుంది. ఇందులో డీసిటీ అనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. టాటా మోటార్స్ ఈ కారును జనవరి 2020లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, కంపెనీ ఇప్పుడు దాని ఆటోమేటిక్ వేరియంట్ తీసుకురాబోతోంది. కంపెనీ గత కొంత కాలంగా టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను నిరంతరం భారత రోడ్లపై పరీక్షిస్తోంది. గతంలో, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. దీనిని పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే తీసుకొస్తున్నట్లు సమాచారం. (చదవండి: రంగంలోకి టాటా గ్రూప్..! గూగుల్ పే, ఫోన్‌పేలకు ధీటుగా!) -
టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్దం అవుతుంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల్లో ఎంతో ఆసక్తి రేపి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న నెక్సాన్ మోడల్‌కి సంబంధించి టాటా తీపి కబురు చెప్పబోతుంది. ఈ మోడల్‌కి సంబంధించిన రేంజ్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతర్జాతీయ ఈవీలకు దీటుగా ఈ నెక్సాన్ కారును రూపొందిస్తుంది. రేంజ్ వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ సామర్థ్యం పెంచాలని టాటా నిర్ణయించింది. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో కనీసం ప్రయాణ రేంజ్ కనీసం 30 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సామర్థ్యం పెంచిన తర్వాత టాటా మోటార్స్ చేపట్టిన ఇంటర్నల్ టెస్ట్‌లో కారు సింగిల్ రేంజ్ కెపాసిటీ 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే రియల్‌టైంలో ఆన్‌రోడ్ మీద కనీసం 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు చేసిన కొత్త కారు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా. సేల్స్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని సంస్థ యోచిస్తోంది. కంపెనీ తన ఈవీ కార్ల ఉత్పత్తిని రాబోయే రెండు సంవత్సరాలలో వార్షికంగా 1,25,000-150,000 యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్య కార్లను విక్రయించగలిగితే కంపెనీ మొత్తం రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించనుంది. అలాగే, రాబోయే కాలంలో టాటా మోటార్స్ దేశంలో మరో మూడు సరసమైనఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించాలని యోచిస్తుంది. రూ.10 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొని రావాలని చూస్తున్నట్లు సమాచారం. టియాగో ఈవీ, పంచ్ స్మాల్ ఎస్యువీ, ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్లు రూ.10 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ కార్ల కనీస రియల్ రేంజ్ అనేది 200 కిలోమీటర్ల మార్కుకు తగ్గకుండా ఉండాలని చూస్తోంది. ఏడాదికి కనీసం 1 లేదా 2 కార్లను లాంచ్ చేయలని చూస్తోన్నట్లు సంస్థ పేర్కొంది. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
ఆ ఫీట్ దాటేసిన టాటా ఆల్ట్రోజ్.. 20 నెలల్లోనే రికార్డ్ !
ప్రీమియం హచ్‌బ్యాక్ కేటగిరీలో టాటా ఆల్ట్రోజ్ అరుదైన ఘనత సాధించింది. కోవిడ్ సంక్షోభం నడుమ అమ్మకాల్లో దుమ్ము రేపింది. తక్కువ కాలంలోనే మార్కెట్లో తన ముద్రను చూపించింది. 2020 జనవరిలో మైలేజీ తప్ప భద్రతకు పెద్ద పీట వేయని ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో గ్లోబల్ ఎన్సీఏపీ ఫైవ్ స్టార్ రేటింగ్‌తో టాటా సంస్థ ఆల్ట్రోజ్‌ని మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో 2020 జనవరిలో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది. కారు ప్రమోషన్స్ మొదలైన కొద్ది రోజులకే కోవిడ్ సంక్షోభం దేశం మొత్తాన్ని చుట్టేసింది. లాక్డౌన్ ఎఫెక్ట్‌తో చాలా సంస్థలు కార్ల తయారీనే నిలిపేశాయి. కల్లోల పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల మధ్య మార్కెట్లోకి వచ్చినప్పటికీ అమ్మకాల్లో ఆల్ట్రోజ్ రికార్డు సృష్టించింది. కేవలం 20 నెలల వ్యవధిలోనే లక్ష యూనిట్ల కార్ల అమ్మకాలు జరుపుకుని అరుదైన రికార్డు సాధించింది. పూనేలో ఉన్న టాటా కార్ల తయారీ కేంద్రం నుంచి వన్ లాక్ ఆల్ట్రోజ్ కారు యూనిట్‌ని ర్కెట్లోకి పంపినట్టు టాటా ప్రతినిధులు తెలిపారు. 2021 మార్చిలో టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత సగటున ప్రతీ నెల 6,000 కార్ల అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా కరోనా సెకండ్‌వేవ్ దేశాన్ని చుట్టేయడానికి ముందు 2021 మార్చిలో 7,500 కార్ల అమ్మకాలు జరిగాయి. ఇదే ఊపు కొనసాగితే ఎప్పుడో లక్ష యూనిట్ల మార్క్ దాటేవాళ్లమని, అయితే సెకండ్‌వేవ్ తమ స్పీడుకు బ్రేకులు వేయడంతో కొంత ఆలస్యంగా లక్ష యూనిట్ల సేల్స్ మార్క్‌ని దాటిందని కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ ప్రకటించారు. 20 శాతం వాటా ఇరవై నెలల క్రితం మార్కెట్లోకి వచ్చినా.. ఈ ఏడాది టాటా ఆల్ట్రోజ్‌కి వాహన ప్రియులు జై అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్ సేల్స్‌కి సంబంధించి 20 శాతం వాటా ఆల్ట్రోజ్ దక్కించుకుంది. ఇండికా తర్వాత హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో టాటాకు ఆల్ట్రోజ్ వరంలా మారింది. - టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లో ఆరు వేయింట్లలో లభిస్తోంది - పెట్రోలు, డీజిల్ వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది - 5 స్పీడ్ మ్యానువల్ గేర్ సిస్టమ్ ఉంది - ఎక్స్ షోరూంలో వివిధ వేరియంట్లను బట్టి ఈ కారు కనిష్ట ధర రూ. 5.84 లక్షల నుంచి రూ. 9.59 లక్షల వరకు ఉంది. చదవండి : దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్! -
టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ
ఆటోమొబైల్ రంగంలో నంబర్ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎస్‌యూవీకి డిమాండ్ ఇండియన్ మార్కెట్లో గత కొంత కాలంగా ఎస్యూవీ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్లకు ధీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నారు. ఎలాంటి రోడ్లపైనా అయినా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలింగ్ డిఫరెంట్‌గా ఉండటమే ఇందుకు కారణం. పోటీలో టాటా టాటా నుంచి ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా నెక్సాన్ కారు ఉంది. అయితే దీని సగటు ధర పది లక్షలకు దగ్గర ఉంది. ఇంత కంటే తక్కువ ధరలో మరిన్నీ ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎస్యూవీ అందించేందుకు టాటా సిద్ధమైంది. మైక్రో ఎస్యూవీ పేరుతో టాటా హెచ్బీఎక్స్ను మార్కెట్లోకి తేనుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఇప్పటికే ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఎంట్రీ లెవల్లో పోటీ టాటాలో టాప్ ఎండ్ ఎస్‌యూవీగా ఉన్న హారియర్, సఫారీ తరహా ఎక్స్టీరియర్, ఆల్ట్రోజ్ తరహా ఇంటీరియర్‌తో హెచ్బీఎక్స్ ఉండవచ్చని అంచనా. టియాగోలో ఉపయోగించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చతారని సమచారం. మొత్తంగా కారు తయారీకి సంబంధించి ఆల్ఫా ఆర్కిటెక్చర్ మోడల్ ఆధారంగా ఈ కారు రూపుదిద్దుకుంటోంది. మారుతి ఇగ్నీస్, మహీంద్రా కేయూ 100లతో పాటు త్వరలో మార్కెట్లోకి రాబోతున్న హ్యుందాయ్ క్యాస్పర్లకు టాటా హెచ్బీఎక్స్ పోటీ విసరనుంది. It's Showtime! The most awaited SUV now has a name. Stay tuned.#TataMotors #HBX #ComingSoon pic.twitter.com/tI0bZL5ngI — Tata Motors Cars (@TataMotors_Cars) August 21, 2021 చదవండి: Hyderabad: ఐటీ కంపెనీల నయా ట్రెండ్..! -
కాంస్యాన్ని కోల్పోయిన వారికి బహుమతిగా టాటా కార్లు
తమ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత క్రీడాకారులు చరిత్రను సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పతకాల సంఖ్య పెరిగింది. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను వంటి చాలా మంది అథ్లెట్లు పతకాలు సాధించగా, తమ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న వారు ఉన్నారు. అయితే, టోక్యో ఒలింపిక్స్ లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత క్రీడాకారులకు టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్కడ ఓడినా.. మా మనసు గెలుచుకున్నారు అని టాటా ప్రకటించింది. భారతీయ ఒలింపియన్స్ ను సత్కరించిన రెండవ భారతీయ కార్ల కంపెనీగా టాటా మోటార్స్ నిలిచింది. ఇంతకు ముందు ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు ఎక్స్‌యూవీ 700 ఎడిషన్ కారును మహీంద్రా కంపెనీ బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "ఒలింపిక్స్ అంటే కేవలం పతకాలు మాత్రమే కాదు, మన దేశానికి ఈసారి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లు ఒలింపిక్స్ లో కనబరిచిన కృషిని, స్ఫూర్తిని చూసి మేము సంతోషిస్తున్నాము. ఒత్తిడిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కూడా వారు పతకాన్ని కోల్పోయి ఉండవచ్చు.. కానీ వారు తమ అంకితభావంతో లక్షలాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. ఇది భారతదేశంలో రాబోయే వర్ధమాన క్రీడాకారులకు వారు నిజమైన స్ఫూర్తి” అని అన్నారు. As a gesture of gratitude, Tata Motors is happy to deliver ALTROZ - #TheGoldStandard to all the Indian athletes who narrowly missed the bronze at #TokyoOlympics. They may not have claimed a medal, but won millions of hearts and inspired billions to set #TheGoldStandard. pic.twitter.com/SlZazXG6HK — Tata Motors Cars (@TataMotors_Cars) August 13, 2021 -
బాలెనో, ఆల్ట్రోజ్ కంటే తక్కువ ధరలో.. i20 ఎరా!
న్యూఢిల్లీ: హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి హ్యుందాయ్ తెరలేపింది. పప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఐ 20 ధరలు తగ్గించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్లో పోటీగా ఉన్నా టాటా, నెక్సాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మాగ్నాకంటే తక్కువ హ్యచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ20కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఐ20 మోడల్లో మాగ్నా వేరియంట్ ధర తక్కువ. ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో మాగ్నా ట్రిమ్ వేరియంట్ ధర రూ. 6.85 లక్షల నుంచి రూ.8.21 లక్షల వరకు లభిస్తోంది. ఇప్పుడు ఇంత కంటే తక్కువ ధరలో ఐ20 ఎరా ట్రిమ్ మోడల్‌ను మార్కెట్లోకి తెస్తోంది. రూ. 6 లక్షల దగ్గర కేవలం పెట్రోల్ వెర్షన్లోనే లభించే హ్యుందాయ్ ఐ20 ఎరా ట్రిమ్ మోడల్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇదే సెగ్మెంట్లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 5.80 లక్షలు, నెక్సా బాలెనో ధర రూ. 5.98 లక్షలుగా ఉంది. ఇంచుమించు వీటికి దగ్గరగానే ఐ20 ఎరా ట్రిమ్ ప్రైస్ ఉండేలా హ్యుందాయ్ జాగ్రత్త పడుతోంది. నో కాంప్రమైజ్ ధర తగ్గించినప్పటికీ కారు బిల్ట్ క్వాలిటీలో హ్యుందాయ్ పెద్దగా కాంప్రమైజ్ కావడం లేదు.పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఎయిర్ కండీషన్, మాన్యువల్ గేర్ సిస్టమ్ అందిస్తోంది. అయితే వెనుక వైపు పవర్ విండోస్‌కి బదులు మాన్యువల్ విండోస్ అందించింది. నేటి ట్రెండ్‌కి తగ్గ ఇన్ఫోంటైన్ సిస్టమ్ కాకుండా బేసిక్ ఇన్ఫోంటైన్ సిస్టమ్ అందిస్తోంది. త్వరలో ఈ కారుకు సంబంధించి మరిన్ని వివరాలు హ్యుందాయ్ వెల్లడించనుంది. -
మనసు దోచే ‘టాటా’ డార్క్ ఎడిషన్స్
న్యూఢిల్లీ : డార్క్ ఎడిషన్ పేరుతో సక్సెస్ఫుల్ మోడల్ కార్లకు టాటా మోటార్స్ కొత్త రూపు ఇస్తోంది. టాటా హ్యరియర్, అల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీ మోడల్స్‌లో ఉన్న అన్ని వేరియంటర్లలో డార్క్ వెహికల్స్ అందుబాటులోకి తేనుంది. ధర ఎంతంటే ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం డార్క్ ఎడిషన్లకు సంబంధించి టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 8.71 లక్షలు, నెక్సాన్ ధర రూ. 10.40 లక్షలు, నెక్సాన్ ఈవీ ధర రూ. 15.99 లక్షలు ఉండగా హ్యరియర్ ధర రూ. 18.04 లక్షలుగా ఉంది. వివిధ నగరాలు, వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. డార్క్ స్పెషల్స్ ఆల్ట్రోజ్‌లో డార్క్ ఎడిషన్‌ను XZ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూ మోడల్ కాస్మో డార్క్ కలర్ స్కీంతో ఎక్స్టీరియర్ డిజైన్ చేశారు. ఎల్లాయ్ వీల్స్, క్రోమ, బ్యానెట్, ముందు భాగంలో డార్క్ ఎంబ్లమ్ అమర్చారు. ఇక ఇంటీరియర్‌కి సంబంధించి గ్రాఫైట్ బ్లాక్ థీమ్‌తో పాటు గ్లాసీ ఫినీష్ ఉన్న డ్యాష్‌బోర్డ్, ప్రీమియం లెదర్ సీట్స్ విత్ డార్క్ ఎంబ్రాయిడరీతో వచ్చేలా డిజైన్ చేశారు. నెక్సాన్ ఇలా ఇక నెక్సాన్‌లో చార్కోల్ ఎల్లాయ్ వీల్స్, సోనిక్ సిల్వర్ బెల్ట్‌లైన్, ట్రై యారో డ్యాష్‌బోర్డ్ , లెదర్ సీట్లు, డోర్ ట్రిమ్స్ అండ్ ట్రై యారో థీమ్‌తో డిజైన్ చేశారు. నెక్సాన్ ఈవీలో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్‌లో కారు బాడీకి మిడ్నైట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. సాటిన్బ్లాక బెల్ట్‌లైన్, చార్కోల్ వీల్ ఎల్లాయిస్ అందించారు. ఇంటీరియర్‌లో కూడా పూర్తిగా డార్క్ థీమ్ ఫాలో అయ్యారు. హ్యారియర్‌తో మొదలు డార్క్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా తీసుకురావడం గురించి టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మొదట హ్యారియర్ మోడల్లో డార్క్ ఎడిషన్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాం. మేము ఊహించనదాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. హ్యారియర్ అమ్మకాల్లో డార్క్ ఎడిషన్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిన స్థాయికి చేరుకుంది. దీంతో వినియోగదారుల టేస్ట్‌కి తగ్గట్టుగా మిగిలిన మోడల్స్‌లో కూడా డార్క్ ఎడిషన్స్ తీసుకురావాలని నిర్ణయించాం’ అని తెలిపారు. -
టాటా మోటార్స్ నుంచి ‘ఆల్ట్రోజ్ ట్రిమ్’
ముంబై: టాటా మోటార్స్ తన పెట్రోల్ వేరియంట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘‘ఆల్ట్రోజ్ ట్రిమ్’’ కారును ఇలీవల ఆవిష్కరించింది. ఇందులో 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 108 బీహెచ్పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ సాయంతో కారు కేవలం 12 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 90 పీఎస్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఈ కొత్త ఆల్ట్రోజ్ ట్రిమ్ ధరను కంపెనీ జనవరి 22న ప్రకటించనుంది. అదేరోజున అమ్మకాలు ప్రారంభమవుతాయి. డిజిల్ వేరియంట్లోని ఆల్ట్రోజ్ మోడల్ కార్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల యూనిట్లను విక్రయించామని, ఇప్పటికీ డిమాండ్ బలంగా ఉందని కంపెనీ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజాగా ఆవిష్కరించిన ఈ పెట్రోల్ వేరియంట్ ఆల్ట్రోజ్ ట్రిమ్ కు ఇదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని శ్రీవాస్తవ ఆశించారు. తగ్గిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్ ముంబై: ప్రముఖ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ డిసెంబర్ క్వార్టర్ గ్లోబల్ సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. జాగ్వార్ లాండ్ రోవర్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,78,915 వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం(2019–20) ఇదే క్యూ3లో అమ్ముడైన 2,76,127 యూనిట్లతో పోలిస్తే వృద్ధి కేవలం ఒకశాతంగానే ఉంది. వార్షిక ప్రాతిపదికన ఇదే త్రైమాసికంలో టాటా దైవో హోల్‌సేల్ వాహన అమ్మకాలు 4 క్షీణించి 90,365 యూనిట్లుగా నమోదయ్యాయి. జేఎల్ఆర్ విభాగంలో 1,19,658 వాహన యూనిట్లను విక్రయించింది. అయితే ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం వృద్ధిని సాధించి 1,88,550 యూనిట్లగా నమోదయ్యాయి. చదవండి: 4.71 లక్షల ఎస్‌యూవీల రీకాల్