టాటా మోటార్స్‌ నుంచి ‘ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌’ | Tata Motors Unveils Altroz Trim New Car | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ నుంచి ‘ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌’

Jan 15 2021 12:20 PM | Updated on Jan 15 2021 8:51 PM

Tata Motors Unveils Altroz Trim New Car - Sakshi

టాటా మోటార్స్‌ తన పెట్రోల్‌ వేరియంట్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌ కారును ఆవిష్కరించింది.

ముంబై: టాటా మోటార్స్‌ తన పెట్రోల్‌ వేరియంట్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ‘‘ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌’’ కారును ఇలీవల ఆవిష్కరించింది. ఇందులో 1.2 లీటర్‌ టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 108 బీహెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌ సాయంతో కారు కేవలం 12 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 90 పీఎస్‌ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ఈ కొత్త ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌ ధరను కంపెనీ జనవరి 22న ప్రకటించనుంది. అదేరోజున అమ్మకాలు ప్రారంభమవుతాయి.

డిజిల్‌ వేరియంట్‌లోని ఆల్ట్రోజ్‌ మోడల్‌ కార్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల యూనిట్లను విక్రయించామని, ఇప్పటికీ డిమాండ్‌ బలంగా ఉందని కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌ వివేక్‌ శ్రీవాస్తవ తెలిపారు. తాజాగా ఆవిష్కరించిన ఈ పెట్రోల్‌ వేరియంట్‌ ఆల్ట్రోజ్‌ ట్రిమ్‌ కు ఇదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని శ్రీవాస్తవ ఆశించారు.

తగ్గిన టాటా మోటార్స్‌  గ్లోబల్‌ సేల్స్‌
ముంబై: ప్రముఖ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ డిసెంబర్‌ క్వార్టర్‌  గ్లోబల్‌ సేల్స్‌ అంతంత మాత్రంగానే ఉన్నాయి. జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,78,915  వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం(2019–20) ఇదే క్యూ3లో అమ్ముడైన 2,76,127 యూనిట్లతో పోలిస్తే వృద్ధి కేవలం ఒకశాతంగానే ఉంది. వార్షిక ప్రాతిపదికన ఇదే త్రైమాసికంలో టాటా దైవో హోల్‌సేల్‌ వాహన అమ్మకాలు 4 క్షీణించి 90,365 యూనిట్లుగా నమోదయ్యాయి. జేఎల్‌ఆర్‌ విభాగంలో 1,19,658  వాహన యూనిట్లను విక్రయించింది. అయితే ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 4 శాతం వృద్ధిని సాధించి 1,88,550 యూనిట్లగా నమోదయ్యాయి. 

చదవండి:
4.71 లక్షల ఎస్‌యూవీల రీకాల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement