McLaren Artura supercar launched in India: Check price, features & top speed details - Sakshi
Sakshi News home page

McLaren Artura: అత్యంత ఖరీదైన మెక్‌లారెన్ సూపర్‌కార్‌ - 330 కిమీ/గం స్పీడ్

Published Fri, May 26 2023 2:36 PM | Last Updated on Fri, May 26 2023 3:00 PM

Mclaren artura super car launched price features and top speed details - Sakshi

McLaren Artura: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ సూపర్‌కార్‌ తయారీ సంస్థ 'మెక్‌లారెన్' (McLaren) ఖరీదైన హైబ్రిడ్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సూపర్‌కార్‌ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన 'మెక్‌లారెన్ ఆర్టురా' హైబ్రిడ్ సూపర్‌కార్‌ ధర రూ. 5.1 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ప్రపంచములో అత్యంత ఖరీదైన కారు మాత్రమే కాదు అత్యంత వేగవంతమైన కారు కూడా. ఇప్పటికే సంస్థ తన కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించింది. అయితే తన పరిధిని విస్తరించడంతో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

డిజైన్
కొత్త మెక్‌లారెన్స్ ఆర్టురా మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని హెడ్‌ల్యాంప్ క్రింద అదనపు లైటింగ్ ఎలిమెంట్‌ కూడా లభిస్తుంది. ఇది చూడటానికి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. రియర్ ప్రొఫైల్ సన్నని టెయిల్-ల్యాంప్‌ పొందుతుంది.

(ఇదీ చదవండి: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!)

ఫీచర్స్
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8.0 ఇంచెస్ వర్టికల్ మౌంటెడ్ టచ్‌స్క్రీన్‌ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ లభిస్తుంది. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు USB పోర్టులు, ADAS టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

ఇంజిన్ 
కొత్త మెక్‌లారెన్ ఆర్టురా PHEV 3.0-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజన్‌ కలిగి 95 hp పవర్, 225 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 585 hp పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తం మీద ఈ కారు 680 హార్స్ పవర్ & 720 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇందులో లభిస్తుంది. కావున కేవలం 3.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ట వేగం గంటకు 330 కిమీ వరకు ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది.

(ఇదీ చదవండి: భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు)

మెక్‌లారెన్ ఆర్టురాలో 7.4 కిలోవాట్ బ్యాటరీ 31 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీని కేవలం 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఇందులో ఈ మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

మెక్‌లారెన్ ఆర్టురా కార్బన్ లైట్ వెయిట్ ఆర్కిటెక్చర్ (MCLA)ని కలిగిన మొదటి మోడల్. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా తయారైన ఈ కారు 4539 మిమీ పొడవు, 2080 మిమీ, 1193 మిమీ ఎత్తు, 2640 మిమీ వీల్‌బేస్‌తో 66 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ కారు ముందు ట్రంక్‌లో 160 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ సూపర్‌కార్‌కు ప్రధాన ప్రత్యర్థి లేదు, కానీ మసెరటి MC 20 మాత్రం ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement