Supercars
-
రూ. 5.1 కోట్ల మెక్లారెన్ కొత్త సూపర్‌కార్ ఇదే - పూర్తి వివరాలు
McLaren Artura: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ సూపర్‌కార్ తయారీ సంస్థ 'మెక్లారెన్' (McLaren) ఖరీదైన హైబ్రిడ్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సూపర్‌కార్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో అడుగుపెట్టిన 'మెక్లారెన్ ఆర్టురా' హైబ్రిడ్ సూపర్‌కార్ ధర రూ. 5.1 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ప్రపంచములో అత్యంత ఖరీదైన కారు మాత్రమే కాదు అత్యంత వేగవంతమైన కారు కూడా. ఇప్పటికే సంస్థ తన కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించింది. అయితే తన పరిధిని విస్తరించడంతో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని విడుదల చేసినట్లు తెలుస్తోంది. డిజైన్ కొత్త మెక్లారెన్స్ ఆర్టురా మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని హెడ్‌ల్యాంప్ క్రింద అదనపు లైటింగ్ ఎలిమెంట్ కూడా లభిస్తుంది. ఇది చూడటానికి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. రియర్ ప్రొఫైల్ సన్నని టెయిల్-ల్యాంప్ పొందుతుంది. (ఇదీ చదవండి: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!) ఫీచర్స్ ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8.0 ఇంచెస్ వర్టికల్ మౌంటెడ్ టచ్స్క్రీన్ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు USB పోర్టులు, ADAS టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఇంజిన్ కొత్త మెక్లారెన్ ఆర్టురా PHEV 3.0-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజన్ కలిగి 95 hp పవర్, 225 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 585 hp పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తం మీద ఈ కారు 680 హార్స్ పవర్ & 720 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇందులో లభిస్తుంది. కావున కేవలం 3.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ట వేగం గంటకు 330 కిమీ వరకు ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) మెక్లారెన్ ఆర్టురాలో 7.4 కిలోవాట్ బ్యాటరీ 31 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీని కేవలం 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఇందులో ఈ మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది. మెక్లారెన్ ఆర్టురా కార్బన్ లైట్ వెయిట్ ఆర్కిటెక్చర్ (MCLA)ని కలిగిన మొదటి మోడల్. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైన ఈ కారు 4539 మిమీ పొడవు, 2080 మిమీ, 1193 మిమీ ఎత్తు, 2640 మిమీ వీల్‌బేస్‌తో 66 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ కారు ముందు ట్రంక్‌లో 160 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ సూపర్‌కార్‌కు ప్రధాన ప్రత్యర్థి లేదు, కానీ మసెరటి MC 20 మాత్రం ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంది. -
లంబోర్గిని సూపర్ లగ్జరీ కార్లు: ధర రూ. 4 కోట్లకు పైమాటే
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో విడుదలైన మోడళ్లను భారత్‌కు పరిచయం చేయాలని కార్ల తయారీ దిగ్గజం ఆటోమొబిలి లంబోర్గీని భావిస్తోంది. ఇక్కడి సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానాన్ని బలపర్చుకోవడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. లంబోర్గీని హురకాన్ టెక్నికా మోడల్‌ను గురువారం భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.4.04 కోట్ల నుంచి ప్రారంభం. త్వరలోనే ఊరూస్ పెర్ఫార్మెంట్ ఎస్‌యూవీని ఇక్కడకు తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. విదేశీ మోడళ్లను భారత్‌లో త్వరతగతిన విడుదల చేసేందుకు కృషిచేస్తున్నట్టు లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. కొత్త మోడళ్లను వేగంగా స్థానిక మార్కెట్లోకి తీసుకురావడం భారత్‌లో సంస్థ వృద్ధికి కీలక స్తంభమని ఆయన అన్నారు. గతంలో 8-10 నెలల సమయం పట్టేదని చెప్పారు. విదేశాల్లో పరిచయం చేసిన నెల రోజుల్లో ఊరూస్ను ఇక్కడకు తెచ్చామని, హురకాన్ ఈవోను తొలుత భారత్‌లో విడుదల చేశామన్నారు. లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2021లో కంపెనీ భారత్‌లో 69 కార్లను విక్రయించింది. హురకాన్ టెక్నికా 5.2 లీటర్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది. -
కోటి రూపాయల పైగా తగ్గిన ఆ కారు ధర
దేశమంతా ఒకే పన్ను విధానమంటూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ మహిమతో దాదాపు అన్ని కార్ల ధరలు తగ్గిపోతున్నాయి. లగ్జరీ కారు తయారీదారులు కూడా తమ పాపులర్ మోడల్స్‌పై రేట్లను భారీగా తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ కారు తయారీదారులు రోడ్డు పన్నును రూ.20 లక్షల వరకు తగ్గించేశాయి. అంతర్గత రాష్ట్రాల పరిమితులతో ఇన్ని రోజులు కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువమొత్తంలో రోడ్డు పన్నులు చెల్లించేవారికి ఇది గుడ్న్యూస్గా మారింది. కొత్త జీఎస్టీ రేట్లు, అప్డేటెడ్ రోడ్డు పన్ను విధానంతో సూపర్ కార్లు చాలా చౌకగా మారుతున్నాయని తెలిసింది. సూపర్ కారు తయారీదారిలో ఒకటైన లంబోర్ఘిని దాదాపు కోటి రూపాయలకు పైగా ధరలను తగ్గించింది. ఒకవేళ తమ సూపర్ కారు అవెంటడర్ ఎస్ కొనుగోలు చేయాలనుకునే వారికి రూ.1.05 కోట్ల వరకు తగ్గింపు పొందుతారని లంబోర్ఘిని పేర్కొంది. అయితే దీనిలో ఇన్సూరెన్స్ ధరలు కలుపలేదు. ఆస్టన్ మార్టిన్, ఫెరారీ, రోల్స్-రాయిస్ మోడల్స్, బెంట్లీ లాంటి మిగతా సూపర్ కార్లు, స్పోర్ట్స్ కార్ల తయారీదారులు కూడా కార్ల సంస్థలు కూడా త్వరలో ధరలు తగ్గింపును ప్రకటించనున్నాయి. ప్రస్తుతం లంబోర్ఘిని అవెంటడర్ ఎస్ ధర ఈ విధంగా ఉంది... లంబోర్ఘిని అవెంటడర్ ఎస్ ప్రీ-జీఎస్టీ ధర పోస్టు జీఎస్టీ ధర ఎక్స్‌షోరూం ధర రూ.5.01 కోట్లు రూ.5.01 కోట్లు రోడ్డు పన్ను రూ.1 కోటి రూ.20 లక్షలు(క్యాప్ లిమిట్) ఆక్ట్రాయ్ రూ.22.54 లక్షలు నాట్-అప్లికేబుల్ ఆన్-రోడ్డు ధర రూ.6.23 కోట్లు రూ.5.21 కోట్లు (ఇన్సూరెన్స్ ముందు)