న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో విడుదలైన మోడళ్లను భారత్‌కు పరిచయం చేయాలని కార్ల తయారీ దిగ్గజం ఆటోమొబిలి లంబోర్గీని భావిస్తోంది. ఇక్కడి సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానాన్ని బలపర్చుకోవడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. లంబోర్గీని హురకాన్ టెక్నికా మోడల్‌ను గురువారం భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.4.04 కోట్ల నుంచి ప్రారంభం.
త్వరలోనే ఊరూస్ పెర్ఫార్మెంట్ ఎస్‌యూవీని ఇక్కడకు తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. విదేశీ మోడళ్లను భారత్‌లో త్వరతగతిన విడుదల చేసేందుకు కృషిచేస్తున్నట్టు లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. కొత్త మోడళ్లను వేగంగా స్థానిక మార్కెట్లోకి తీసుకురావడం భారత్‌లో సంస్థ వృద్ధికి కీలక స్తంభమని ఆయన అన్నారు. గతంలో 8-10 నెలల సమయం పట్టేదని చెప్పారు. విదేశాల్లో పరిచయం చేసిన నెల రోజుల్లో ఊరూస్‌ను ఇక్కడకు తెచ్చామని, హురకాన్ ఈవోను తొలుత భారత్‌లో విడుదల చేశామన్నారు. లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2021లో కంపెనీ భారత్‌లో 69 కార్లను విక్రయించింది. హురకాన్ టెక్నికా 5.2 లీటర్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment