rose day special bollywood rohanpreet singh special gift for neha kakkar - Sakshi
Sakshi News home page

రోజ్‌ డే: నేహాను సర్‌ప్రైజ్‌ చేసిన రోహన్‌

Feb 8 2021 1:05 PM | Updated on Feb 8 2021 1:32 PM

Rose Day: Rohanpreet Singh Special Gift To Neha Kakkar - Sakshi

ఈ ప్రేమ పూల వర్షంలో తడిసి ముద్దైన నేహా ఇన్‌స్టా వేదికగా భర్తకు రోజ్‌ డే శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, అతడిచ్చిన గులాబీని ముద్దాడుతూ వీడియో షేర్‌ చేసింది.

పెళ్లికి ముందు లెక్కలేనన్ని బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు ప్రేమికులు. కానీ ఒక్కసారి ఏడడుగులు నడిచిన తర్వాత గిఫ్ట్‌ అన్న పదాన్నే గాలికొదిలేస్తుంటారు. కానీ ఈ బాలీవుడ్‌ జంట నేహా-రోహన్‌ మాత్రం పెళ్లైనా ఎప్పటికీ నిత్యప్రేమికులమే అంటోంది. ఆదివారం రోజ్‌డేను పురస్కరించుకుని గాయకుడు, నటుడు రోహన్‌ ప్రీత్‌ సింగ్‌ తన అర్ధాంగి, గాయని నేహా కక్కర్‌కు ప్రత్యేక బహుమతులు పంపాడు.

ఇందులో ఎర్రటి రోజా పూలు, మధ్యలో తీయనైన చాక్లెట్లు ఉన్నాయి. ఈ బహుమతి ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ప్రేమ పూల వర్షంలో తడిసి ముద్దైన నేహా ఇన్‌స్టా వేదికగా భర్తకు రోజ్‌ డే శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, అతడిచ్చిన గులాబీని ముద్దాడుతూ వీడియో షేర్‌ చేసింది. కాగా నేహా, రోహన్‌ ప్రీత్‌ గతేడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తర్వాత దుబాయ్‌కు హనీమూన్‌ వెళ్లి అక్కడే దీపావళి జరుపుకున్నారు. అనేక మ్యూజిక్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ఇండియన్‌ ఐడల్‌ జడ్జిగా వ్యవహరిస్తోంది. అటు రోహన్‌ కూడా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో బిజీగా ఉన్నాడు.

చదవండి: ఒక్క క్లిక్‌తో పెళ్లి కుమార్తెలా మెరవవచ్చు..

ఐస్‌క్రీమ్‌ తింటున్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement