Taarak Mehta Ka Ooltah Chashmah Makers Break Silence On Neha Mehta Pending Dues - Sakshi
Sakshi News home page

Taarak Mehta Ka Ooltah Chashmah: టీఆర్పీలో టాప్‌.. కానీ నటులకు జీతాలివ్వట్లేదా? మేకర్స్‌ ఏమన్నారంటే?

Published Sat, Jun 25 2022 6:32 PM | Last Updated on Sat, Jun 25 2022 7:47 PM

Taarak Mehta Ka Ooltah Chashmah Makers Break Silence On Neha Mehta Pending Dues - Sakshi

తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా.. ఈ పేరు తెలియని హిందీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఫేమస్‌ అయిందీ సీరియల్‌. ఇందులో నటించిన నటీనటులకు సైతం మంచి పేరుప్రఖ్యాతలు దక్కాయి. అయితే ఈ సీరియల్‌ నిర్మాతలు తనకు డబ్బులివ్వడం లేదంటూ నటి నేహా పలుమార్లు మీడియా ముందు వాపోయింది. ఈ ధారావాహికలో తారక్‌ మెహతా భార్య అంజలి మెహతా పాత్రలో నటించిన నేహ 2020లోనే సీరియల్‌ నుంచి తప్పుకుంది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఆరు నెలల నుంచి రెమ్యునరేషన్‌ అందలేదని, ఈ బకాయిలను ఇంకెప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో తనకింతవరకు పూర్తిగా పారితోషికం అందనేలేదని అసహనానికి లోనైంది నేహ.

తాజాగా ఆమె ఆరోపణలపై తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా నిర్మాతలు స్పందించారు. 'ఆర్టిస్టులను మేము కుటుంబంగా పరిగణిస్తాం. నేహా ఈ సీరియల్‌ నుంచి తప్పుకున్నాక కొన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలని చెప్పాం. ఈ ధారావాహిక నుంచి ఎగ్జిట్‌ అవుతున్నట్లుగా కొన్ని పత్రాలపై సంతకం చేయాలని సూచించాం. కంపెనీ పాలసీ ప్రకారం ఆ సంతకం చేసిన తర్వాతే ఆమెకు సెటిల్‌మెంట్‌ చేయగలం. ఆమెతో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఆమె ఖాతరు చేయడం లేదు. అంతేకాదు ఈ సీరియల్‌ నుంచి కూడా చెప్పాపెట్టకుండా తప్పుకుంది. 12 ఏళ్లపాటు ఫేమ్‌, మంచి కెరీర్‌ను ఇచ్చిన మేకర్స్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి బదులుగా మెయిల్స్‌కు స్పందిస్తే బాగుంటుంది' అంటూ నీలా ఫిలిం ప్రొడక్షన్స్‌ ఓ లేఖను విడుదల చేసింది. ఇకపోతే తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా 2008లో ప్రారంభమైంది. 13 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ నిర్విరామంగా ముందుకు సాగుతోంది.

చదవండి: హీరోయిన్‌ ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌, ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్‌
ఘనంగా నాగశౌర్య సోదరుడి వివాహం, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement