
న్యూఢిల్లీ : పాపులర్ రియాలిటీ షో హిందీ ‘బిగ్ బాస్ 12’లో కంటెస్టెంట్, బుల్లితెర నటి నేహా పెండ్సే ప్రేమలో పడింది. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది. నేహ తన స్నేహితుడు షార్దూల్ సింగ్ బయాస్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఫొటోలకు క్యాప్షన్‌గా హార్ట్ ఎమోజీని ఉంచింది. ఈ క్రమంలో.. ‘నెటిజన్లు అత్యంత ముచ్చటైన జంట’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలో నేహ నిశ్చితార్థపు వేలికి ఉంగరం ఉండటంతో... వీరిద్దరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై నేహా స్పందిస్తూ ‘ప్రస్తుతానికి మేమిద్దరం రిలేషన్‌షిప్ ఉన్నాం. పెళ్లి ఎప్పుడనేది మాకే స్పష్టత లేదు’ అని ఓ ఇంటర్యూలో వెల్లడించింది. ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 12లో కంటెస్టెంట్‌లు దీపికా కాకర్, కరణ్‌వీర్ బొహ్రాలతో పాటు పాల్గొన్న బుల్లితెర నటి నేహా కూడా ఫేమస్ అయ్యారు. కాగా నేహా 1999లో వచ్చిన ‘ప్యార్ కోయ్ ఖేల్ నహీ’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం,మలయాళం, కన్నడతో పాటు మరాఠీ సినిమాల్లోనూ కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment