
నలుగురు అబ్బాయిలతో ఒక అమ్మాయి ఎలా ప్రయాణం చేసింది? ఈ ఐదుగురి మధ్య జరిగిన సంఘటన ఏంటి? అనే కథతో రూపొందిన చిత్రం ‘నలుగురితో నారాయణ’. రంజిత్ రాచకొండ, సిద్ధార్థ, వంశీధర్, జై సంపత్ హీరోలుగా, నేహా హీరోయిన్‌గా రామ్ యస్. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నలుగురితో నారాయణ’. ‘దేవుడే దిక్కు’ ఉపశీర్షిక. జి.ఎల్.బి. శ్రీనివాస్ సమర్పణలో శ్రీ కల్వకుంట్ల రవీంద్ర రావు సారథ్యంలో ఎమ్‌డి అస్లాం నిర్మించారు. ఎమ్‌డి అస్లాం మాట్లాడుతూ– ‘‘రామ్ యస్. కుమార్ దర్శకత్వంలో గతంలో ‘అంతా విచిత్రం’ సినిమా తీశా.. ఇప్పుడు ‘నలుగురితో నారాయణ‘ నిర్మించాను. తన దర్శకత్వంలోనే ‘24 గంటలు’ అనే సినిమా రూపొందించనున్నాం’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన చిత్రమిది. ఇదే బ్యానర్‌లో మూడో సినిమా చేసే చాన్స్ ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్’’ అన్నారు.