Is Sonam Kapoor, Neha Kakkar pregnant?: బాలీవుడ్ భామలు కొంచెం లావెక్కితే చాలు గర్భం దాల్చారా? అంటూ అనుమానాలు, కాస్త బక్కచిక్కితే మరీ అంత డైటింగ్ అవసరం లేదంటూ వెటకారాలు సోషల్ మీడియాలో కామన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియాకు చిక్కిన ఇద్దరు తారలు సోనమ్ కపూర్, నేహా కక్కర్‌లకు కూడా ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు నెటిజన్లు.
కోవిడ్ వల్ల ఏడాది కాలంగా లండన్‌లోనే ఉండిపోయిన సోనమ్ ఇటీవలే ముంబైకు తిరిగొచ్చింది. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే ఆమె ఈ సమయంలో వదులైన జాకెట్‌ను ధరించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె గర్భవతని అభిప్రాయపడుతున్నారు. అందుకే లూజ్ జాకెట్ వేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో సోనమ్ దంపతులకే తెలియాలి. కాగా సోనమ్ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లో పెళ్లాడింది.
మరోవైపు బాలీవుడ్ టాప్ సింగర్ నేహా కక్కర్ కూడా గర్భం దాల్చిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. గతేడాది రోహన్‌ప్రీత్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా భర్తతో కలిసి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఆమె వదులైన టీ షర్టు ధరించింది. పైగా ప్రయాణం చేసి కాస్త అలిసిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె భర్త రోహన్‌ప్రీత్ ముందుగా నేహాను కారులో కూర్చోబెట్టాకే తను కారెక్కాడు. అయితే నేహా వాలకం, ఆమె మీద రోహన్ కేరింగ్ చూస్తుంటే కన్ఫామ్‌గా ఆమె గర్భవతే అని డిసైడ్ అయిపోతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు 'ఇండియన్ ఐడల్ 12' షో నుంచి నేహా తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.
#sonamkapoor returns to India after more than a year. She had left with hubby #anandahuja and they have been in London due to to Covid-19. Father #anilkapoor comes to pick her up at the Mumbai airport. pic.twitter.com/qnMiJxPfHA
— Viral Bhayani (@viralbhayani77) July 13, 2021
Comments
Please login to add a commentAdd a comment