Sonam Kapoor On Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఏడాది తర్వాత లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఆమె ఈ సందర్భంగా వదులైన జాకెట్‌ను ధరించింది. ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే సోనమ్ అలా లూజ్ డ్రెస్ వేయడంతో ఆమె గర్భవతంటూ నెటిజన్లు డౌటు పడ్డారు. కొంతమందైతే ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తూ విషెస్ కూడా తెలియజేశారు. దీంతో ఎట్టకేలకు సోనమ్ ఈ పుకార్లపై స్పందించింది. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తనకు పీరియడ్స్ వచ్చినట్లు స్పష్టం చేసింది. 'పీరియడ్స్ మొదటి రోజున వేడి నీళ్లు, అల్లం టీ తాగుతున్నాను' అని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పెట్టినట్లైంది.
ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ.. 'లండన్‌లో లభించే స్వేచ్ఛ నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఉండే చోటును నేనే శుభ్రం చేసుకుంటాను, నాకవసరమైనవి నేనే కొని తెచ్చుకుంటాను, నాకేది కావాలో అది వండుకుని తింటాను. నాకిక్కడ ఉండటం చాలా ఇష్టం, కానీ ఫైనల్‌గా నాకు ఇండియా అంటేనే ప్రాణం' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment