32 కిలోలు పెరిగా.. లైఫ్‌ ఒక్కసారిగా ఛేంజ్‌: హీరోయిన్‌ | Sonam Kapoor Gained 32 Kilos Post-Childbirth | Sakshi
Sakshi News home page

Sonam Kapoor: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది!

Published Sat, Apr 27 2024 2:00 PM | Last Updated on Sat, Apr 27 2024 4:17 PM

Sonam Kapoor Gained 32 Kilos Post-Childbirth

భర్తతోనే కాదు మనతో మనకున్న అనుబంధం కూడా చేంజ్‌ అవుతుంది. సడన్‌గా అన్నీ మారిపోతాయి. మునుపటిలా మన శరీరం గురించి ఆలోచించలేము. కాగా ఈ ఏడాది ప్రా

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో బరువు పెరగడం ఖాయం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఉన్నట్లుండి బరువు పెరుగుతారు. కొందరు డెలివరీ తర్వాత మామూలైపోయినప్పటికీ మరికొందరు మాత్రం మరింత లావైపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌. సోనమ్‌- అహుజా దంపతులు 2022 ఆగస్టులో వాయు అనే కుమారుడికి జన్మనిచ్చారు.

32 కిలోలు పెరిగా
ఆ సమయంలో తాను ఉన్నట్లుండి లావైపోయానంటోంది సోనమ్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ తర్వాత నేను 32 కిలోలు పెరిగాను. నిజంగా చాలా బాధేసింది. కానీ ఆ టైంలో బిడ్డగురించే ఆలోచిస్తామే తప్ప సరైన ఫుడ్‌ తీసుకోవాలని, వర్కవుట్‌ చేయాలనే ఆలోచించం. మళ్లీ మామూలవడానికి ఏడాదిన్నర పట్టింది. 

సడన్‌గా అన్నీ ఛేంజ్‌
కానీ అప్పటికే లైఫ్‌ మారిపోతుంది. భర్తతోనే కాదు మనతో మనకున్న అనుబంధం కూడా చేంజ్‌ అవుతుంది. సడన్‌గా అన్నీ మారిపోయి కొత్తగా అనిపిస్తాయి. మునుపటిలా మన శరీరం గురించి ఆలోచించలేము అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సోనమ్‌ వర్కవుట్స్‌పై ఎక్కువ ఫోకస్‌ చేసింది. తన జిమ్‌ వీడియోలను షేర్‌ చేస్తూ వావ్‌.. 20 కిలోలు తగ్గాను.. ఇంకా ఆరు తగ్గాలి అని రాసుకొచ్చింది. ఆ ఆరు కూడా ఎప్పుడో తగ్గేసి స్లిమ్‌గా మారిపోయింది సోనమ్‌.

చదవండి: ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో విజయ్‌ రొమాన్స్‌.. చివరి చిత్రమిదేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement