
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ పేద పిల్లలకు సాయం చేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. చేయి చాచి అడిగిన పిల్లలకు లేదనకుండా సాయం చేసి అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన నేహా దగ్గరికి ఇద్దరు వీధిబాలలు చేరుకుని టిష్యూ పేపర్లు కొనమని కోరారు. దీంతో ఈ గాయని ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే రూ.2 వేల నోట్లను తీసి వారి చేతిలో పెట్టింది. ఇలా వీధిబాలలకు సాయం చేస్తుండగా క్లిక్‌మనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె దాతృత్వానికి పొంగిపోయిన అభిమానులు నేహాను పొగడ్తలతో ముంచెత్తారు. ‘కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి’, ‘ఆమెది బంగారం లాంటి మనసు. చిన్నపిల్లలు అడగగానే ఏ మాత్రం సంకోచించకుండా, చిరాకు పడకుండా సహాయం చేసింది’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. (ఉదిత్ నారాయణ్ కొడుకుతో సింగర్ పెళ్లి!!)
ఇక కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన నేహాను మీ పెళ్లెప్పుడంటూ ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీనికి ఆమె ఏమీ బదులివ్వకుండా చిరునవ్వుతో అక్కడ నుంచి నిష్క్రమించింది. సోషల్ మీడియాలో మాత్రం తన పెళ్లివార్తలపై స్పందించింది. సింగర్ ఆదిత్య నారాయన్‌ను పెళ్లాడనుందన్న వార్తలను ఖండించింది. తాను సింగిల్‌గానే ఎంతో హ్యాపీగా ఉన్నానంటూ. పెళ్లి.. గిల్లీ ఏమీ లేదని స్పష్టం చేసింది. కాగా గతంలోనూ ఐడల్ సింగర్ ప్రోగ్రామ్‌లో ఆదిత్య నారాయణ తల్లిదండ్రులు స్టేజీపైకి వచ్చి నేహాను కోడలిగా చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది కేవలం టీఆర్పీల కోసమే చేశామని చెప్పడంతో ప్రేక్షకులు ఒకింత నిరుత్సాహానికి గురికాగా మమ్మల్ని ఫూల్ చేశారంటూ వారిపై మండిపడ్డారు. ఇక వీరిద్దరూ కలిసి ఆడిపాడిన ‘గోవా బీచ్ సాంగ్’ ఈమధ్యే రిలీజ్ కాగా అది యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. (నేహాను ఇప్పటికీ గౌరవిస్తున్నా: మాజీ ప్రియుడు)
Comments
Please login to add a commentAdd a comment