ఆ విభాగంలో భారత్‌కు తొలి పతకం.. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే! | Asian Games 2023: Neha Thakur Silver Medal In Sailing, Check India Medal Tally - Sakshi
Sakshi News home page

Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో రజతం.. ఆ విభాగంలో తొలిసారి! విజేతను ఎలా నిర్ణయిస్తారంటే?

Published Tue, Sep 26 2023 12:39 PM | Last Updated on Tue, Sep 26 2023 1:49 PM

Asian Games 2023: Neha Thakur Silver In Sailing Check India Medal Tally - Sakshi

రజతం గెలిచిన నేహా ఠాకూర్‌ (PC: SAI)

Asian Games 2023- Neha Thakur Silver In Sailing: భారత్‌ ఖాతాలో మరో ఆసియా క్రీడల పతకం చేరింది. సెయిలింగ్‌(ఐఎల్‌సీఏ డింఘీ)లో నేహా ఠాకూర్‌ సిల్వర్‌ మెడల్‌తో మెరిసింది. దీంతో ఆసియా క్రీడలు-2023లో భారత్‌ పతకాల సంఖ్య 12కు చేరింది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో సెయిలింగ్‌లో ఇండియాకు ఇదే తొలి మెడల్‌ కావడం విశేషం.

విజేతను ఎలా నిర్ణయిస్తారంటే?
కాగా ఇంటర్నేషనల్‌ లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ 2019లో సెయిలింగ్‌ విభాగంలో ఐఎల్‌సీఏ డింఘీ పేరిట రేసులకు అనమతినిచ్చింది. ఇక ఐఎల్‌సీఏ డింఘీ-4 కేటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. ఇందులో సెయిలర్‌ వరస్ట్‌ స్కోరును.. మొత్తం రేసు పాయింట్ల నుంచి మైనస్‌ చేస్తారు. తద్వారా నెట్‌ స్కోరును నిర్ణయిస్తారు.

నేహా 11 రేసులలో మొత్తంగా
పోటీ ముగిసేలోపు ఎవరైతే తక్కువ నెట్‌ స్కోరు కలిగి ఉంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. కాగా 19వ ఆసియా క్రీడల్లో నేహా ఠాకూర్‌ ఐఎల్‌సీఏ డింఘీ-4 విభాగంలో 11 రేసులలో కలిపి 32 పాయింట్లు స్కోరు చేసింది. ఐదో ప్రయత్నంలో అత్యల్ప స్కోరు సాధించగా.. నెట్‌ స్కోరు 27గా నమోదైంది.

ఈ క్రమంలో థాయ్‌లాండ్‌కు చెందిన నొప్పాస్సాన్‌ ఖుబూంజాన్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించి నేహా వెండి పతకం గెలుపొందింది. ఈ విభాగంలో థాయ్‌లాండ్‌కు స్వర్ణం, సింగపూర్‌కు కాంస్యం(కియారా మేరీ- నెట్‌ స్కోరు 28) దక్కాయి.

ఇప్పటికి ఎన్ని పతకాలంటే?
కాగా నేహా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల నేషనల్‌ సెయిలింగ్‌ స్కూల్‌లో సెయిలర్‌గా ఓనమాలు నేర్చుకుంది. ఇక చైనాలోని హోంగ్జూ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మంగళవారం(సెప్టెంబరు 26) మధ్యాహ్నం నాటికి భారత్‌ ఖాతాలో 2 పసిడి, నాలుగు రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

చదవండి: వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్‌ ఆటగాడు రీ ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement