Sailing Competition
-
హైదరాబాద్ : సాగర జలాల్లో ‘సెయిలింగ్’ విన్యాసాలు (ఫొటోలు)
-
ఆ విభాగంలో భారత్‌కు తొలి పతకం.. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే!
Asian Games 2023- Neha Thakur Silver In Sailing: భారత్ ఖాతాలో మరో ఆసియా క్రీడల పతకం చేరింది. సెయిలింగ్(ఐఎల్సీఏ డింఘీ)లో నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్‌తో మెరిసింది. దీంతో ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. ఇక ఈ మెగా ఈవెంట్లో సెయిలింగ్‌లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం. విజేతను ఎలా నిర్ణయిస్తారంటే? కాగా ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 2019లో సెయిలింగ్ విభాగంలో ఐఎల్సీఏ డింఘీ పేరిట రేసులకు అనమతినిచ్చింది. ఇక ఐఎల్సీఏ డింఘీ-4 కేటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. ఇందులో సెయిలర్ వరస్ట్ స్కోరును.. మొత్తం రేసు పాయింట్ల నుంచి మైనస్ చేస్తారు. తద్వారా నెట్ స్కోరును నిర్ణయిస్తారు. నేహా 11 రేసులలో మొత్తంగా పోటీ ముగిసేలోపు ఎవరైతే తక్కువ నెట్ స్కోరు కలిగి ఉంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. కాగా 19వ ఆసియా క్రీడల్లో నేహా ఠాకూర్ ఐఎల్సీఏ డింఘీ-4 విభాగంలో 11 రేసులలో కలిపి 32 పాయింట్లు స్కోరు చేసింది. ఐదో ప్రయత్నంలో అత్యల్ప స్కోరు సాధించగా.. నెట్ స్కోరు 27గా నమోదైంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్‌కు చెందిన నొప్పాస్సాన్ ఖుబూంజాన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించి నేహా వెండి పతకం గెలుపొందింది. ఈ విభాగంలో థాయ్‌లాండ్‌కు స్వర్ణం, సింగపూర్‌కు కాంస్యం(కియారా మేరీ- నెట్ స్కోరు 28) దక్కాయి. ఇప్పటికి ఎన్ని పతకాలంటే? కాగా నేహా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల నేషనల్ సెయిలింగ్ స్కూల్లో సెయిలర్‌గా ఓనమాలు నేర్చుకుంది. ఇక చైనాలోని హోంగ్జూ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మంగళవారం(సెప్టెంబరు 26) మధ్యాహ్నం నాటికి భారత్ ఖాతాలో 2 పసిడి, నాలుగు రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ 🥈🌊 Sailing Success! Neha Thakur, representing India in the Girl's Dinghy - ILCA 4 category, secured the SILVER MEDAL at the #AsianGames2022 after 11 races⛵ This is India's 1️⃣st medal in Sailing🤩👍 Her consistent performance throughout the competition has earned her a… pic.twitter.com/0ybargTEXI — SAI Media (@Media_SAI) September 26, 2023 -
హుస్సేన్ సాగర్ తీరాన సెయిలింగ్ వీక్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లేసర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జే ఎస్ సిధాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరచిన సెయిలర్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ పోటీలను ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌గా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌ను నిర్వహిస్తున్న సికింద్రాబాద్ ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్‌ను అభినందించారు. అంతే కాకుండా క్రీడా రంగంలో యువతను విశేషంగా ప్రోత్సహిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ అభినందించారు. లేజర్ స్టాండర్డ్, లేజర్ 4.7 తదితర విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో మంగళవారం వరకు 11 క్లబ్స్ నుంచి 89 మంది సెయిలర్స్ రిజిష్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో దేశ వ్యాప్తంగా 11 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సెయిలింగ్ వీక్ లో రాష్ట్రం నుంచి 17 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీల్లో తన ప్రతిభను కనబరుస్తున్న 72 ఏళ్ల మురళి కానూరి అతి పెద్ద వయసు్కడిగా అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈ పోటీలు 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ్ రెడ్డి, తదితర ఆర్మీ అధికారులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పేదరికాన్ని జయిస్తున్న సాహసులు
హుస్సేన్‌సాగర్ గట్టుపై కూర్చుని అలలపై కదులుతున్న బోట్లను పరిశీలించడమే తెలుసు. కానీ ఓ రోజు ఆ అలలతో పోటీ పడి బోట్‌ను పరుగులు పెట్టిస్తామని వాళ్లెన్నడూ ఊహించలేదు. సెయిలింగ్... ఖరీదైన క్రీడ. బలమైన గాలులకు ఎదురీదుతూ చాకచక్యంగా బోట్‌ను నడిపే సాహసోపేతమైన ఆట. ఏమాత్రం అటూ ఇటైనా ప్రాణాలకే ప్రమాదం. అలాంటి ఆటలో ఆరి తేరారా పిల్లలు. స్లమ్స్‌లో పుడితేనేం... ఆత్మవిశ్వాసంలో వాళ్లు మిలియనీర్స్. వారి పట్టుదలకు కోచ్ సుహీమ్ షేక్ అంకితభావం తోడయ్యింది. పేదరికాన్ని సవాల్ చేస్తూ... సాగర అలలతోపాటు సంపన్నులతోనూ పోటీ పడుతున్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న డిలైట్ మాన్సూన్ రెగెట్టాలో పాల్గొని నీటిలో చేపలా దూసుకుపోతున్నారు. - .: వాంకె శ్రీనివాస్ రాగి రజనీకాంత్. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న అన్న దగ్గరికొచ్చి ఉంటున్నాడు. హుస్సేన్‌సాగర్ నీటి శుద్ధి కేంద్రంలో పని చేన్తున్న అన్న దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. అప్పుడే కోచ్ సుహీమ్ కంటపడ్డాడు. ఆ అబ్బాయి కళ్లలో మెరుపు, చురుకుదనం చూసిన సుహీమ్ తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. గ్రామాల్లో పుట్టిపెరిగిన పిల్లలకు సహజంగానే ఈత వస్తుంది. బోటింగ్ నేర్పించడమే తరువాయి. అలా ఒక్క రజనీకాంతే కాదు... ఎర్రోళ్ల ప్రసాద్, పూనమ్ లీలా సాగర్, నిఖిల్ కుమార్, ప్రభాకర్, శివరామ్... దాదాపు పదిమంది సుహీమ్ షేక్ దగ్గర సెయిలింగ్‌లో శిక్షణ పొందారు. ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో జరిగిన రెగెటా చాంపియన్‌షిప్‌లలో పాల్గొని పతకాలు తెచ్చారు. సెయిలింగ్ ఇలా... గాలులు బలంగా వీచే సమయంలో మాత్రమే సెయిలింగ్ పోటీలు నిర్వహిస్తారు. వైండ్ వార్డుకు ఎదురుగా బోట్‌ను ఉంచుతారు. పోటీదారులందరికీ త్రికోణాకృతిలో బోట్ నడపాలనే నిబంధన ఉంటుంది. దాంతోపాటు మరో రెండు రౌండ్ల కోసం ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక మ్యాప్ ఇస్తారు. ఈ ఆట 45 నిమిషాల పాటు సాగుతుంది. ఎవరు ముందు లక్ష్యాన్ని చేరుకుంటే వారికి ఒక పాయింట్ ఇస్తారు. రెండో వాడికి రెండు, మూడో వ్యక్తికి మూడు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ సైలింగ్ మధ్యలో ఒకరి బోట్‌ను మరొకరు ఢీకొట్టారంటే వారు ఆట నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. 45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 180 డిగ్రీల కోణంలో సెయిలింగ్ చేసుకునేందుకు అవకాశముంటుంది. రక్షణ ఇలా... ఒక బోట్లో మూడు బౌన్సీలు ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా బోట్లోకి నీరు వచ్చి చేరినా అవి పీల్చుకుంటాయి. బోట్ వెనుక రాడార్, మధ్యలో సెంటర్ బోర్డు ఉంటుంది. బోట్లో సెయిలర్లు ఎటువైపు కూర్చుంటే అటువైపు రాడార్ పట్టుకొని కదిపితే ముందుకు వెళతారు. లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి. హుస్సేన్‌సాగర్‌లో జారిపడ్డాం.. ‘సెయిలింగ్ అంటే మొదట్లో చాలా భయపడ్డాం. మాకు అప్పటికే ఈత రావడంతో నేరుగా బోట్లోకి ఎక్కి సెయిలింగ్ ప్రాక్టీసు మొదలెట్టాం. ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తుండగా రెండు, మూడుసార్లు హుస్సేన్‌సాగ ర్లో జారిపడ్డాం. మాలాంటివాళ్లకు బోట్ ఎక్కడమే గగనం. అట్లాంటిది ఆ బోట్లో ఉండి నీటిపై ఆటలంటే అసలే సాధ్యం కాదు. వెనక్కి పోదామనుకున్నప్పుడల్లా ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్‌ను గుర్తుకు తెచ్చుకున్నాం. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే ఏం సాధించలేం అనుకున్నా... ముందుకు పోవడానికే నిర్ణయించుకున్నాం. ఇక సుహీమ్సార్ ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. సెయిలింగ్‌పై పూర్తి పట్టు సాధించాం. ఇప్పుడు చదువుకుంటూనే సెయిలింగ్‌ను కొనసాగిస్తున్నాం. భవిష్యత్‌లో సూపర్ సెయిలర్స్ అవుతాం’ అంటూ పిల్లలు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమ్మాయిలూ... ఇప్పుడిప్పుడే అమ్మాయిలూ ఈ ఆట వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వేసవిలోనే సెయిలింగ్‌లో శిక్షణ పొందిన అనీషా కూడా మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ఇరగదీస్తానంటోంది. పిన్న వయస్సులోనే ఈ ఆటలోకి అడుగుపెట్టిన జుహీ విన్యాసాలు చూస్తే అబ్బురమనిపిస్తుంది. సికింద్రాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల జుహీ వరల్డ్ చాంపియన్ అవుతానని అంటోంది. శుక్రవారం జరిగే అండర్-14 పిల్లలు పాల్గొనే అప్టీ ఫ్లీట్ పోటీలకు సమాయత్తమవుతోంది. ‘గతేడాది కేవలం 23 కేజీలు మాత్రమే ఉన్నా. బోట్‌కు సరిపడా బరువులేనని పోటీలకు దూరం పెట్టారు. ప్రస్తుతం సరిపడ బరువు సాధించా. ఈసారి జరిగే పోటీల్లో రాణిస్తా’నంటోంది జుహీ చిరునవ్వులు చిందిస్తూ. అర్హత ఇదీ... యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన క్లబ్‌లలో సభ్యులుగా ఉండాలి. అప్పుడు సంబంధిత క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం దక్కుతుంది. ఆర్మీకి చెందిన ఈఎంఈ సభ్యులకు కూడా అవకాశముంటుంది. సెయిలింగ్ అనగానే ధనికుల ఆట అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. కానీ పట్టుదల ఉండాలే కానీ.. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. అలా పట్టుదల ఉన్న పిల్లలను యాచ్ క్లబ్లో చేర్చుకుని మరీ సెయిలింగ్ నేర్పిస్తున్నాం. ఇప్పుడిక్కడ పోటీ పడుతున్న 10 మంది పిల్లలను అలాగే తీర్చిదిద్దాం. చాలా నిరుపేద కుటుంబాలనుంచి వచ్చినవాళ్లు. కొంతమందికైతే తల్లిదండ్రులు కూడా లేరు. అయినా ఆ పిల్లల్లో నేర్చుకోవాలన్న తపన ఉంది. అదే వాళ్లను ముందుకు నడిపిస్తోంది. హైదరాబాద్‌లోనే కాదు... ఇతర రాష్ట్రాల్లో జరిగే పోటీలకూ వారిని తీసుకెళ్తున్నాం. ఆ ఖర్చులన్నీ క్లబ్ భరిస్తుంది. - సుహీమ్ షేక్, హైదరాబాద్ యాచ్ క్లబ్ వ్యవస్థాపకుడు -
అలలపై ఆట
డీలైట్ మాన్సూన్ రెగెట్టా పోటీలకు నగరం సిద్ధమైంది. అమెరికా కప్ ఫార్మాట్ తరహాలో తొలిసారిగా హుస్సేన్‌సాగర్‌లో మంగళవారం నుంచి నిర్వహిస్తున్న సెయిలింగ్ పోటీలకు సెయిలర్లు సన్నద్ధమయ్యారు. ఈసారి రూ.కోట్ల విలువ చేసే అమెరికా బోట్లతో పోటీల్లో పాల్గొననుండటం నగరవాసులను ఆకర్షిస్తోంది. ఫ్లీట్ రేసింగ్, మ్యాచ్ రేసింగ్‌లు వురో ఆకర్షణ. పోటీలు టీవీలో కూడా ప్రసారవువుతారుు. అవగాహన కోసం సెయిలర్లకు ఇప్పటికే ప్రత్యేక కోర్సుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కొత్త తరహా నిబంధనల వల్ల బోట్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండదు. సెయిలర్లకు పూర్తి రక్షణ ఉంటుంది. ఏయే విభాగాలు... అప్టిమిస్ట్ (అండర్-15), టాపర్ (అండర్-19), ఒమెగా (పిల్లల నుంచి పెద్దల వరకు) విభాగాల వారీగా ఈ పోటీలు ఉంటాయి. లక్ష రూపాయల విలువ చేసే అప్టిమిస్ట్ బోట్లను పిల్లలు ఉపయోగిస్తారు. కోట్ల రూపాయల విలువ చేసే అమెరికా కప్ బోట్లను ఒమెగా విభాగంలో సెయిలర్లు వినియోగించనున్నారు. ఆనందంగా ఉంది ‘1994 సంవత్సరంలో తొలిసారిగా హైదరాబాద్‌లోనే సెయిలింగ్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచా. మళ్లీ ఇప్పుడు తొలిసారి అమెరికా కప్ ఫార్మాట్ పోటీల్లో పాల్గొననుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అని వరల్డ్ చాంపియన్ మహేష్ రాంచంద్రన్ చెప్పాడు. ‘నాలుగేళ్ల నుంచి హుస్సేన్ సాగర్‌లోనే సెరుులింగ్ ప్రాక్టీసు చేస్తున్నా. యాట్చ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ తీసుకున్నా. గతేడాది జరిగిన మాన్సూన్ రెగెట్టా పోటీల్లో కాంస్య పతకం సాధించా. ఈసారి కూడా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తా’నని హైదరాబాద్ సెయిలర్ రాగి రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. సిటీప్లస్