
హుస్సేన్ సాగర్‌కు సెయిలింగ్ పోటీలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. సాగర జలాల్లో అందమైన తెరచాపలపై అద్భుతమైన విన్యాసాలతో సెయిలర్లు ఆకట్టుకుంటున్నారు

భారత సెయిలింగ్ కేలెండర్‌లో ప్రతిష్టాత్మక పోటీలైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ మంగళవారం ఇక్కడ ఘనంగా ప్రారంభమైంది

ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సెయిలింగ్ వీక్‌ను లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా ప్రారంభించారు

ఈ ఏడాది వైఏఐ ర్యాంకింగ్ పోటీలుగా ప్రారంభమైన ఈ సెయిలింగ్ వీక్‌లో ఐఎల్‌సీఏ 7, ఐఎల్‌సీఏ 6, ఐఎల్‌సీఏ 4 విభాగాల్లో బాలురు, బాలికలు 470 క్లాస్‌తో పోటీ పడనున్నారు

లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు కమోడోర్ ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ నేతృత్వంలో ఈ పోటీలు కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు




