‘మీ జంట చూడముచ్చటగా ఉంది’ | Neha Kakkar And Rohanpreet Singh Haldi Ceremony Pics | Sakshi
Sakshi News home page

హల్దీ వేడుక.. ఫొటోలు షేర్‌ చేసిన సింగర్‌

Published Sat, Oct 24 2020 8:09 AM | Last Updated on Sat, Oct 24 2020 10:22 AM

Neha Kakkar And Rohanpreet Singh Haldi Ceremony Pics - Sakshi

పసుపు రంగు దుస్తుల్లో, సంప్రదాయ వస్త్రధారణతో ఎంతో అందంగా కనిపిస్తున్న నీహూప్రీత్‌ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. నటుడు, గాయకుడు రోహన్‌ప్రీత్‌సింగ్‌తో త్వరలోనే ఆమె వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్న ఈ ప్రేమజంట ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచకుంది. ఇక అప్పటి నుంచి #నీహూప్రీత్‌ హ్యాష్‌ట్యాగ్‌తో తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన మెహందీ, హల్దీ ఫంక్షన్‌ ఫొటోలను నేహా కక్కర్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. పసుపు రంగు దుస్తుల్లో, సంప్రదాయ వస్త్రధారణతో ఎంతో అందంగా కనిపిస్తున్న నీహూప్రీత్‌ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ప్యాలెస్‌ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!)

‘‘చూడముచ్చగా ఉన్నారు. బెస్ట్‌ జోడీ. మరిన్ని సంతోషాలు మీ సొంతం కావాలి’’ అంటూ కామెంట్ల రూపంలో ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా అక్టోబ‌ర్ 26న ఢిల్లీలో వీరి వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, పంజాబ్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్‌.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి ఎన్నో పాటలు ఆలపించి గుర్తింపు దక్కించుకున్నారు. రోహన్‌ప్రీత్‌, ముజ్‌ సే షాదీ కరోగీ అనే వెడ్డింగ్‌ రియాలిటీ షోతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement