రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టివేత
Published Mon, Jun 26 2017 11:06 AM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM
జామి: విజయనగరం జిల్లా జామి మండలం లక్ష్మీపురం వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ బొలేరో వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు.
28 బస్తాల్లో గంజాయిని రవాణా చేస్తున్నారు. దీని విలువ రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు వ్యాన్‌ను వదిలి పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement