సాక్షి, అనకాపల్లి: ఏపీలో గంజాయి రవాణాపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గంజాయి రవాణా పెరిగింది. గంజాయి సంబంధిత కేసుల నుంచి తమను తప్పించాలని టీడీపీకి చెందిన నేతలే తన వద్దకు వస్తున్నారని అన్నారు. చిన్న పిల్లలు సైతం గంజాయి సేవిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఏపీలో గంజాయి అమ్మకం, రవాణాను స్పీకర్ అయ్యన్నపాత్రుడు కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వైఫల్య పాలనను ఆయన చెప్పకనే చెప్పేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా సప్లై అవుతోంది. గంజాయి కేసుల నుంచి తప్పించమని కొంతమంది మా దగ్గరికి వస్తున్నారు. మా పార్టీకి చెందిన వారు కూడా నా వద్దకు వస్తున్నారు. వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదు.
విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్లే సమయంలో ఎంతోమంది గంజాయి సేవిస్తూ కనిపిస్తున్నారు. చిన్న పిల్లల సైతం మదాలు దగ్గర కూర్చొని గంజాయిని తాగుతున్నారు. గంజాయి తాగవద్దని చెప్పిన ఒక పెద్దాయనను నర్సీపట్నంలో చితకబాదారు. గంజాయిని రాష్ట్రంలో రూపుమాపకపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. రాష్ట్రంలో గంజాయి పరిస్థితిని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment