తలుపుల: అనంతపురం జిల్లా లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని తలుపుల మండలం బండ్లపల్లి వద్ద శనివారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫరీదా అనే మహిళ నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విజయవాడ నుంచి తీసుకొస్తున్నట్టు ముందస్తు సమాచారం రావడంతో ఈ దాడులు చేపట్టారు. సదరు మహిళపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.
6 కిలోల గంజాయి స్వాధీనం
Published Sat, Nov 28 2015 10:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
Advertisement
Advertisement