
143 కిలోల ఎండుగంజాయి పట్టివేత
13మందిపై కేసు, ఇద్దరి అరెస్టు
నారాయణఖేడ్: రవాణాకు నిల్వ ఉంచిన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ రవికాంత్, ఏఈఎస్ సైదులు తెలిపారు. కల్హేర్ మండలం ముబాకర్‌పూర్‌పై దాడిజరిపినట్లు తెలిపారు. 143 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొన్నామని, 13మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇద్దరు నిందితులు అశోక్, అంజయ్యలను అరెస్టుచేశామని, మరో 11మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. పీర్ల తండాపై దాడిచేసి గతంలో బైండోవర్ అయి మళ్ళీ నాటుసారా విక్రయిస్తున్న సంతులిబాయిని అరెస్టుచేసినట్లు తెలిపారు.
మరో నిందితురాలు చాందిబాయి పారిపోయిందన్నారు. బైండోవర్ అయినా నాటుసారా విక్రయించినందుకు వీరు రూ. లక్ష జరిమానా చెల్లించాలని, లేదా ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ రాజ్‌ప్రకాస్, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, సూర్యప్రకాష్, గంగాధర్‌లు పాల్గొన్నారు.