పల్స్‌పోలియో విజయవంతం | pulse polio successfully running in karimnagar district | Sakshi
Sakshi News home page

పల్స్‌పోలియో విజయవంతం

Published Sun, Feb 22 2015 2:58 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

pulse polio successfully running in karimnagar district

కోనరావుపేట : పోలియో మహమ్మారి నామరూపాలు లేకుండా చేయడానికి ఏర్పాటుచేసిన రెండవ విడత పోలియో ఆదివారం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రెండు చుక్కలు వేయడంతో ఈ మహమ్మారిని పారద్రోలడానికి అధికారులంతా కలసికట్టుగా ముందడుగు వేశారు.

కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ లక్ష్మి ప్రారంభించారు. ఆదివారం ఉదయం రెండేళ్ల బాబుకు పోలియో చుక్కలు వేసిన ఆమె అందరు కలిసి పోరాడి పోలియోను రూపుమాపాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement