జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కడపసిటీ, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 92.41శాతం మందికి పోలియో చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలు 3,17,452 మంది ఉన్నారు. వీరిలో 2,93,358 మందికి చుక్కలు వేశారు. మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమంలో 100.01 శాతం లక్ష్యాలను చేరుకున్నారు. రెండవ విడత మొదటి రోజు 92.41శాతం మందికి పోలియో చుక్కలు వేశారు.
నేడు ఇంటింటికి.. :
జిల్లాలోని ప్రతి గృహానికి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం సోమవారం చేపడుతున్నారు. వందశాతం పల్స్‌పోలియో నిర్వహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.