చిన్నారికి పోలియోచుక్కలు వేస్తున్న మంత్రి హరీశ్
కవాడిగూడ (హైదరాబాద్): ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో రాకుండా తల్లిదండ్రులు 2 పోలియో చుక్కలు వేయించాలని వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పిల్లల బంగారు భవి ష్యత్ కోసం పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొ నాలని సూచించారు. ఆదివారం ఆయన ఇందిరా పార్కులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు.
రాష్ట్రంలో పల్స్‌పోలియో కోసం 23 వేల సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ కార్యక్రమంలో తెలంగాణ ముందుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, డీఎంహెచ్‌వో వెంకటి, జిల్లా వైద్యాధికారులు డాక్టర్ సుధీర్, శ్రీకళ తది తరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 37,28,334 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అర్హులైన పిల్లల్లో 97.3% మందికి పోలియో చుక్కలు వేశామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment