
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేడు (ఆదివారం) పల్స్‌పోలియో చుక్కల మందు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 50.90 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నట్టు ప్రజారోగ్యశాఖ అంచనా వేసింది. వీళ్లందరికీ పల్స్‌పోలియో చుక్కలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, అంగన్‌వాడీ సెంటర్లతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో కూడా చుక్కల మందు వేయనున్నట్టు అధికారులు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 37,538 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. లక్షన్నర మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించిన సెంటర్లలో చుక్కలు వేస్తారు. మళ్లీ మార్చి 11న పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ పోలియో రహిత దేశంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment