‘ఆశ’ నిరాశే
జోగిపేట: గ్రామీణ ప్రాంత పేద ప్రజలు జ్వరం, ఇతర ఏ అ నారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే ఆశా వర్కర్లనే ఆశ్రయిస్తారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించి ఉచితంగా మందులు ఇవ్వడం, గర్భిణులను విధిగా పీహెచ్‌సీకి తీసుకువెళ్లడం, పుట్టిన బిడ్డలకు టీకా లు, వ్యాక్సిన్లు వేయించడం, క్షయ, కుష్టు, బోద వ్యాధి గ్ర స్తులను గుర్తించడం వీరి ప్రధాన బాధ్యతలు, మహిళల ను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఒప్పించడం కూడా వీ రి విధే. ఎన్నికల విధులు, జనాభా లెక్కల సేకరణ పల్స్‌పోలియో, గ్రామాల్లో వ్యాధులు ప్రబలినప్పుడు ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు కూడా ఆశా కార్యకర్తలు సేవలను అందిస్తారు. పల్స్‌పోలియో, 104 శిబిరాలు, పీహెచ్‌సీల్లోనూ వీరితో పనులు చేయిస్తున్నారు.
ఇచ్చేది బెత్తెడు..చాకిరి మూరెడు
పల్స్‌పోలియోలో ఏఎన్‌ఎం అంగన్‌వాడీలకు సహకరిం చినందుకు ఒక్కొక్క ఆశ కార్యకర్తకు రూ.225, పదినెలల పాటు బాలింతలకు ఆరోగ్య బాధ్యతలను చూసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తే కేవలం రూ.150 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. కాన్పుకు రూ.300 ఇమ్యూనైజేషన్‌కు ఒక్కో డోస్‌కు రూ.20, క్షయ రోగికి ఆరు నెలల వరకు వైద్య సేవలు చేస్తే కేవలం రూ.250. అయితే లా ఇచ్చే గౌరవ వేతనం వారికి సరిపోవడంలేదు. రెండేళ్లుగా యూనిఫాం ఇవ్వడంలేదు. ప్రభుత్వం రెండు చీరలకు రూ.500 నుంచి రూ.600 కేటాయిస్తుంటే అధికారులు రూ.250 నుంచి రూ.300లే ఖర్చు చేస్తున్నారు. ప్రజలకు స్థానికంగా ఉంటూ ఇంతగా సేవలను అందిస్తున్నా పనికి తగ్గ వేతనం లభించడంలేదని నిరాశ చెందుతున్నారు. వచ్చే గౌరవ వేతనం తమకు సరిపోవడంలేదని గోడు వెల్లగక్కుతున్నారు. ఇచ్చే గౌరవ వేతనం కూడా మూడు నెలలకోసారి ఇవ్వడంతో పూట గడవడంలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఆశవర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు ఇక్క ప్రభుత్వం ఎందుకు ఇవ్వదని కార్యకర్తలు అడుగుతున్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకు రూ.2వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు ప్రతిపాదనలు జరుగగా వాటిని తదానంతరం వచ్చిన పాలకులు తుంగలో తొక్కారని ఆశవర్కర్లు ఆరోపిస్తున్నారు. 104 శిబిరాల సేవలు కుష్టు రోగులకు సంబంధించిన పారితోషికాలను రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని సమాచారం.