jogi peta
-
‘ఆశ’ నిరాశే
జోగిపేట: గ్రామీణ ప్రాంత పేద ప్రజలు జ్వరం, ఇతర ఏ అ నారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే ఆశా వర్కర్లనే ఆశ్రయిస్తారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించి ఉచితంగా మందులు ఇవ్వడం, గర్భిణులను విధిగా పీహెచ్‌సీకి తీసుకువెళ్లడం, పుట్టిన బిడ్డలకు టీకా లు, వ్యాక్సిన్లు వేయించడం, క్షయ, కుష్టు, బోద వ్యాధి గ్ర స్తులను గుర్తించడం వీరి ప్రధాన బాధ్యతలు, మహిళల ను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఒప్పించడం కూడా వీ రి విధే. ఎన్నికల విధులు, జనాభా లెక్కల సేకరణ పల్స్‌పోలియో, గ్రామాల్లో వ్యాధులు ప్రబలినప్పుడు ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు కూడా ఆశా కార్యకర్తలు సేవలను అందిస్తారు. పల్స్‌పోలియో, 104 శిబిరాలు, పీహెచ్‌సీల్లోనూ వీరితో పనులు చేయిస్తున్నారు. ఇచ్చేది బెత్తెడు..చాకిరి మూరెడు పల్స్‌పోలియోలో ఏఎన్ఎం అంగన్వాడీలకు సహకరిం చినందుకు ఒక్కొక్క ఆశ కార్యకర్తకు రూ.225, పదినెలల పాటు బాలింతలకు ఆరోగ్య బాధ్యతలను చూసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తే కేవలం రూ.150 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. కాన్పుకు రూ.300 ఇమ్యూనైజేషన్‌కు ఒక్కో డోస్‌కు రూ.20, క్షయ రోగికి ఆరు నెలల వరకు వైద్య సేవలు చేస్తే కేవలం రూ.250. అయితే లా ఇచ్చే గౌరవ వేతనం వారికి సరిపోవడంలేదు. రెండేళ్లుగా యూనిఫాం ఇవ్వడంలేదు. ప్రభుత్వం రెండు చీరలకు రూ.500 నుంచి రూ.600 కేటాయిస్తుంటే అధికారులు రూ.250 నుంచి రూ.300లే ఖర్చు చేస్తున్నారు. ప్రజలకు స్థానికంగా ఉంటూ ఇంతగా సేవలను అందిస్తున్నా పనికి తగ్గ వేతనం లభించడంలేదని నిరాశ చెందుతున్నారు. వచ్చే గౌరవ వేతనం తమకు సరిపోవడంలేదని గోడు వెల్లగక్కుతున్నారు. ఇచ్చే గౌరవ వేతనం కూడా మూడు నెలలకోసారి ఇవ్వడంతో పూట గడవడంలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఆశవర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు ఇక్క ప్రభుత్వం ఎందుకు ఇవ్వదని కార్యకర్తలు అడుగుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకు రూ.2వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు ప్రతిపాదనలు జరుగగా వాటిని తదానంతరం వచ్చిన పాలకులు తుంగలో తొక్కారని ఆశవర్కర్లు ఆరోపిస్తున్నారు. 104 శిబిరాల సేవలు కుష్టు రోగులకు సంబంధించిన పారితోషికాలను రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని సమాచారం. -
అన్నివర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి
జోగిపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ర్టంలో అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొనఆనరు. మంగళవారం జోగిపేటలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యంలో కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిరహర దీక్ష లు చేపట్టారని కొనియాడారు. శాంతియుత వాతావరణంలో ఉద్యమాన్ని నడిపంచిన ఘనత కేసీఆర్దేనన్నా రు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో ఇంత పె ద్ద సభ నిర్వహించడంతో ఇతర పార్టీ నాయకులకు ఇక నిద్ర పట్టదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయడం ఖామయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ అన్నా రు. కాంగ్రెస్ హయంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడమే నేర్చుకున్న సీమాంధ్రులు తెలంగాణ ప్రజల అభివృద్ధిని నీరుగార్చారన్నారు. తెలంగాణ తీసుకు వచ్చి ఎంతో మందికి ప్రాణాలు పోసిన దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. సభ చరిత్రాత్మకం జోగిపేటలో నిర్వహించి తెలంగాణ విజయోత్సవ చరి త్రలోనే నిచిపోతుందని మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి అన్నా రు. రాష్ట్రం ఎర్పడ్డాక ప్రథమ విజయోత్సవ సభ ఇక్కడ జరగడం సంతోషకరమన్నారు. స్థానికంగా అధికారంలో ఉండి ఎటువంటి అభివృద్ధి చేయకున్నా కోట్లాది రూపాయాలు ఘడించిన వారు ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పాడ్డాక అవినీతి లేకుండా చేయాలని ఆయన కేసీఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఉమాదేవి, ఎమ్మెల్యే హన్మంతు షిండే, జిల్లా పార్టీ ఇన్చార్జి రాజ య్యయాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కిష్టయ్య, జహిరాబాద్ ఇన్చార్జి బీబీపాటిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శివశేఖర్, డీసీసీబి మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, నాయకులు నాగభూషణం, గోపి, వీరప్ప, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమరుడి ఇంటికి ఆంధ్ర కోడలు
జోగిపేట, న్యూస్‌లైన్: ప్రాంతీయ విభేదాలు నేతల మధ్యే కానీ, ప్రజల మధ్య కాదని నిరూపించింది ఈ వివాహం. తెలంగాణలోని ఓ అమరుడి కుటుంబం ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువతిని కోడలిగా ఆహ్వానించింది. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన ఉపాధ్యాయుడు కేఆర్ జగదీశ్‌బాబు కుమారుడు హర్షకుమార్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అమ్మాయి రసజ్ఞలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరుప్రాంతాల పెద్దలు అంగీకరించడంతో ఈనెల 12న వివాహం జరిగింది. హర్షకుమార్ బాబాయి కాశరాజు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న విషయం తెలిసి అందరూ అమరుడి ఇంటికి ఆంధ్రా అమ్మాయిగా కోడలుగా వస్తోందన్నారు. తణుకులో జరిగిన ఈ వివాహానికి తెలంగాణ పీఆర్టీయూ నేతలు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.