అమరుడి ఇంటికి ఆంధ్ర కోడలు
జోగిపేట, న్యూస్‌లైన్: ప్రాంతీయ విభేదాలు నేతల మధ్యే కానీ, ప్రజల మధ్య కాదని నిరూపించింది ఈ వివాహం. తెలంగాణలోని ఓ అమరుడి కుటుంబం ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువతిని కోడలిగా ఆహ్వానించింది. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన ఉపాధ్యాయుడు కేఆర్ జగదీశ్‌బాబు కుమారుడు హర్షకుమార్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అమ్మాయి రసజ్ఞలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరుప్రాంతాల పెద్దలు అంగీకరించడంతో ఈనెల 12న వివాహం జరిగింది.
హర్షకుమార్ బాబాయి కాశరాజు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న విషయం తెలిసి అందరూ అమరుడి ఇంటికి ఆంధ్రా అమ్మాయిగా కోడలుగా వస్తోందన్నారు. తణుకులో జరిగిన ఈ వివాహానికి తెలంగాణ పీఆర్‌టీయూ నేతలు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.