
సాక్షి, కరీంనగర్ జిల్లా: ప్రేమకు హద్దులు కుల, మత ప్రాంత, భాష బేధాలు ఏమీ ఉండవని నిరూపించింది. ఈ జంట దేశాలు వేరైనా ప్రేమించుకొని పది సంవత్సరాల తర్వాత గురువారం అలుగునూర్‌లో ఒక్కటయ్యారు.. వివరాలలోకి వెళితే... కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్‌కు చెందిన దాసం అరుణ్ కుమార్ తిమ్మాపూర్‌లోని జ్యోతిశ్మతి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు.
శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ 2014లో ఇద్దరు ఒకరి ఒకరు పరిచయమయ్యారు. ఇలా వారి మధ్య ప్రేమ మొదలై ఇద్దరు మనసులు కలిశాయి. తల్లిదండ్రులు కూడా వారి ప్రేమకు అంగీకరించడంతో అజ్జురా శ్రీలంక నుండి తల్లిదండ్రులతో అలుగునూర్ వచ్చారు. అరుణ్ కుమార్ పెళ్ళి అజ్జురాతో పెద్దల సమక్షంలో గురువారం అంగరంగ వైభోగంగా వివాహ వేడుక జరిగింది.
ఇదీ చదవండి: TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్?
Comments
Please login to add a commentAdd a comment