
కుమారులతో మమత
సాక్షి,వేములవాడఅర్బన్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన పిల్లల గొంతుకోసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వేములవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెన్నపురం గ్రామానికి చెందిన మమతకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మాయిపేటకు చెందిన రమేశ్‌తో వివాహమైంది. ఈ దంపతులకు వరుణ్‌తేజ్, అక్షయ్ సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో నెల రోజుల కిందట మమత తన పిల్లలను తీసుకొని, తల్లిగారింటికి వెళ్లింది.
శనివారం అత్తారింటికి వస్తున్నానని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వేములవాడ వచ్చి, తనకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తానని అతను చెప్పాడు. దీంతో ఆమె వేములవాడ బస్టాండ్‌కు చేరుకొని, రమేశ్‌కు ఫోన్ చేయగా తాను పనిలో ఉన్నానని అర్ధగంట తర్వాత వస్తానన్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మమత క్షణికావేశంలో బ్లేడ్‌తో ఇద్దరు పిల్లల గొంతు కోసి, తానూ కోసుకుంది. తర్వాత భర్తకు, నాంపల్లిలోని బంధువులకు విషయాన్ని ఫోన్‌లో చెప్పింది. వెంటనే వారు అక్కడికి చేరుకొని, బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
చదవండి: పెళ్లిళ్లలో హిజ్రాల వీరంగం.. నిరాకరిస్తే నగ్నంగా డ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment