telangana boy
-
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అల్లుడయ్యాడు!
సాక్షి, కరీంనగర్ జిల్లా: ప్రేమకు హద్దులు కుల, మత ప్రాంత, భాష బేధాలు ఏమీ ఉండవని నిరూపించింది. ఈ జంట దేశాలు వేరైనా ప్రేమించుకొని పది సంవత్సరాల తర్వాత గురువారం అలుగునూర్‌లో ఒక్కటయ్యారు.. వివరాలలోకి వెళితే... కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్‌కు చెందిన దాసం అరుణ్ కుమార్ తిమ్మాపూర్‌లోని జ్యోతిశ్మతి కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ 2014లో ఇద్దరు ఒకరి ఒకరు పరిచయమయ్యారు. ఇలా వారి మధ్య ప్రేమ మొదలై ఇద్దరు మనసులు కలిశాయి. తల్లిదండ్రులు కూడా వారి ప్రేమకు అంగీకరించడంతో అజ్జురా శ్రీలంక నుండి తల్లిదండ్రులతో అలుగునూర్ వచ్చారు. అరుణ్ కుమార్ పెళ్ళి అజ్జురాతో పెద్దల సమక్షంలో గురువారం అంగరంగ వైభోగంగా వివాహ వేడుక జరిగింది. ఇదీ చదవండి: TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్? -
కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్ అమ్మాయి.. అక్కడే మొగ్గ తొడిగిన ప్రేమ
రంగారెడ్డి: కొండారెడ్డిపల్లి అబ్బాయి.. ఐర్లాండ్ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివరాలివీ. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంబరాజు చంద్ర ప్రకాష్ రావు, ఉషశ్రీ దంపతుల రెండో కుమారుడు రాహుల్ హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివి సైక్రియాటిస్ట్లో పీహెచ్డీ చేశాడు. అనంతరం ఉద్యోగం నిమిత్తం ఆరేళ్ల క్రితం ఐర్లాండ్ దేశానికి వెళ్లాడు. అక్కడ మెడికల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. రాహుల్‌కు అదే దేశానికి చెందిన ఎడ్మండ్ వాల్ష్, కార్మెల్ వాల్ష్ ల కూతురు క్లెయర్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకునేందుకు ఇద్దరూ వారి కుటుంబ సభ్యులను ఒప్పించారు. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని వంగ అనంతరెడ్డి గార్డెన్లో ఆదివారం వారి వివాహం ఘనంగా జరిగింది. కల్యాణ మండపం కళకళ వధువు క్లెయర్ తరఫున 60 మంది అతిథులు విమానంలో శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ అతిథుల రాకతో కల్యాణ మండపం కళకళలాడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
చూపులు కలిసిన శుభవేళ.. తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
-
అమెరికా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి.. పెళ్లి మామూలుగా లేదుగా..
సాక్షి, హన్మకొండ: అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి ఒక్కటయ్యారు. మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలయ్యారు. హిందూ సాంప్రదాయం పద్దతిలో ఓరుగల్లు వేదికగా ఖండాంతరం వివాహం చేసుకున్నారు. ఆదర్శ వివాహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు బంధుమిత్రులు హాజరై నవ దంపతులను అభినందించి ఆశీర్వదించారు. చదవండి: పెట్స్.. అదో స్టేటస్! అమెరికా కు చెందిన యువతి డాక్టర్ జెన్నా బ్లెమర్ను హనుమకొండకు చెందిన పుట్ట అరవింద్ రెడ్డి వివాహం చేసుకున్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సాంప్రదాయ పద్దతిలో ఇరు కుటుంబ సభ్యులు వివాహ వేడుక నిర్వహించారు. హన్మకొండకు చెందిన అనిత మోహన్‌రెడ్డి దంపతుల కుమారుడు అరవింద్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా అక్కడ డాక్టర్ జెన్నా బ్లెమర్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు తెలుపగా ఇరువురి పేరెంట్స్ ఓకే చెప్పారు. ఇంకేముంది ముహుర్తం ఖరారు చేసుకుని హిందు సాంప్రదాయ పద్దతిలో హన్మకొండలో వివాహం జరిపించారు. అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరకట్టులో అమెరికా అమ్మాయి, వారి పేరెంట్స్ ముస్తాబై ముచ్చటపడ్డారు. కన్యాదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలు హిందూ వివాహ సాంప్రదాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా, హిందుసాంప్రదాయాలు చాలా బాగున్నాయని నవవదువు జెన్న బ్లెమర్ తెలిపారు. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నామని వరుడు అరవింద్ చెప్పారు. అమెరికాకు చెందిన వధువు పేరెంట్స్ అచ్చం తెలుగువారిలా పంచే, చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. హిందూ సంప్రదాయాలు పెళ్ళితంతు నచ్చిందని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు. అబ్బాయికి నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించడం సంతోషంగా ఉందని వరుడి పేరెంట్స్ తెలిపారు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ.. పెద్దలు అంగీకరించకపోడంతో..
సాక్షి, సుభాష్‌నగర్(హైదరాబాద్): వారి ప్రేమ ఖండాంతరాలు దాటింది. 5 ఏళ్ల క్రితం వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. గాజులరామారం ప్రాంతానికి చెందిన నల్లూరి రఘు మాస్టర్ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేసి ప్రస్తుతం నగరంలోని అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2016 సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న సమయంలో ఆన్లైన్ సెర్చ్‌లో బటెన్ కిస్ట్రా మ్యారీతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 2019లో రఘు హైదరాబాద్‌కు వచ్చి జాబ్‌లో సెటిల్ అయ్యాడు. ఇటీవల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తన ప్రేమ విషయం తెలుపగా వారు నిరాకరించారు. పలు సంబంధాలు చూస్తున్న తరుణంలో కట్నం, ఆస్తి, కులం తదితరాలపై పదేపదే ప్రశ్నలు రావడంతో రఘుకు ఇవి నచ్చేవి కావు. దీంతో ఎట్టకేలకు అమెరికాలో పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పించాడు. 3 ఏళ్ల తరువాత బటెన్ క్రిస్టామ్యారీకి ఫోన్ చేయగా వివాహానికి ఒప్పుకుంది. శుక్రవారం సూరారంలోని కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ జ్యోతి సమక్షంలో ఇరువురు రిజిస్టర్ వివాహం చేసుకుని ఒకటయ్యారు. చదవండి: మాస్కు ధరించకుంటే మూడో వేవ్ తప్పదు -
అమరుడి ఇంటికి ఆంధ్ర కోడలు
జోగిపేట, న్యూస్‌లైన్: ప్రాంతీయ విభేదాలు నేతల మధ్యే కానీ, ప్రజల మధ్య కాదని నిరూపించింది ఈ వివాహం. తెలంగాణలోని ఓ అమరుడి కుటుంబం ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువతిని కోడలిగా ఆహ్వానించింది. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన ఉపాధ్యాయుడు కేఆర్ జగదీశ్‌బాబు కుమారుడు హర్షకుమార్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అమ్మాయి రసజ్ఞలు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరుప్రాంతాల పెద్దలు అంగీకరించడంతో ఈనెల 12న వివాహం జరిగింది. హర్షకుమార్ బాబాయి కాశరాజు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న విషయం తెలిసి అందరూ అమరుడి ఇంటికి ఆంధ్రా అమ్మాయిగా కోడలుగా వస్తోందన్నారు. తణుకులో జరిగిన ఈ వివాహానికి తెలంగాణ పీఆర్టీయూ నేతలు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.