జోగిపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ర్టంలో అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొనఆనరు. మంగళవారం జోగిపేటలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యంలో కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిరహర దీక్ష లు చేపట్టారని కొనియాడారు. శాంతియుత వాతావరణంలో ఉద్యమాన్ని నడిపంచిన ఘనత కేసీఆర్‌దేనన్నా రు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో ఇంత పె ద్ద సభ నిర్వహించడంతో ఇతర పార్టీ నాయకులకు ఇక నిద్ర పట్టదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయడం ఖామయని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ అన్నా రు. కాంగ్రెస్ హయంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడమే నేర్చుకున్న సీమాంధ్రులు తెలంగాణ ప్రజల అభివృద్ధిని నీరుగార్చారన్నారు. తెలంగాణ తీసుకు వచ్చి ఎంతో మందికి ప్రాణాలు పోసిన దేవుడు కేసీఆర్ అని కొనియాడారు.
సభ చరిత్రాత్మకం
జోగిపేటలో నిర్వహించి తెలంగాణ విజయోత్సవ చరి త్రలోనే నిచిపోతుందని మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి అన్నా రు. రాష్ట్రం ఎర్పడ్డాక ప్రథమ విజయోత్సవ సభ ఇక్కడ జరగడం సంతోషకరమన్నారు. స్థానికంగా అధికారంలో ఉండి ఎటువంటి అభివృద్ధి చేయకున్నా కోట్లాది రూపాయాలు ఘడించిన వారు ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పాడ్డాక అవినీతి లేకుండా చేయాలని ఆయన కేసీఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఉమాదేవి, ఎమ్మెల్యే హన్‌మంతు షిండే, జిల్లా పార్టీ ఇన్‌చార్జి రాజ య్యయాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కిష్టయ్య, జహిరాబాద్ ఇన్‌చార్జి బీబీపాటిల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు శివశేఖర్, డీసీసీబి మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, నాయకులు నాగభూషణం, గోపి, వీరప్ప, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి
Published Wed, Apr 2 2014 12:10 AM | Last Updated on Mon, Sep 17 2018 8:21 PM
Advertisement
Advertisement