జిల్లాలో ఆదివారం జరగనున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ అడిషినల్ డెరైక్టర్
పల్స్‌పోలియోకు సర్వం సిద్ధం
Published Sun, Jan 19 2014 5:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరగనున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ అడిషినల్ డెరైక్టర్ తారాచంద్‌నాయుడు తెలిపారు. ఆయన శనివారం చిత్తూరులోని డీఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 4,48,997 మందికి పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2,854 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 285 మందిని రూట్ ఆఫీసర్లుగా నియమించామని వివరించారు. ప్రధాన కూడళ్లు, ఆర్‌టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలియో చుక్కలు వేరుుస్తామన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేసుకోని పిల్లలకు, ఈ నెల 20, 21వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామన్నారు. విద్య, రవాణ, పరిశ్రమలు, పురపాలక, పంచాయతీ, ఐసీడీఎస్, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, సమాచారశాఖ సహకారంతో పల్స్ పోలి యోను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ దశరథరామయ్య, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ భారతీరెడ్డి, డీఐవో డాక్టర్ సురేఖ, డెమో లక్ష్మీ, డెప్యూటీ డెమో ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement