చిన్నారులు పోలియో బారిన పడకుండా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమ విజయవంతానికి అందరూ కృషిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ పిలుపునిచ్చారు.
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: చిన్నారులు పోలియో బారిన పడకుండా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమ విజయవంతానికి అందరూ కృషిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ పిలుపునిచ్చారు. ఆ శాఖ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో పల్స్‌పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి సుబేదారుపేట, గాంధీబొమ్మ మీదుగా వీఆర్‌సీ సెంటర్ వరకు సాగిన ర్యాలీ ని మొదట డీఎంహెచ్‌ఓ ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క చిన్నారి పోలియో వ్యాధి బారినపడకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జయసింహ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం అందరి సహకారం అవసరమన్నారు. ఆది,సోమ, మంగళవారాల్లో వాడవాడలా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ఓ (ఎయిడ్స్,లెప్రసీ) డాక్టర్ పద్మావతి, ఎన్‌సీడీ నోడల్ అధికారి డాక్టర్ రవీంద్రారెడ్డి, డీపీహెచ్‌ఎన్‌ఓ సుగుణ, డెమో ఇన్‌చార్జి సుధామణి, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ వెంకటరమణ, సీడీపీఓ ప్రభావతి పాల్గొన్నారు.