ఇంద్రధనస్సుతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం | dpo luanches pulse polio mission | Sakshi
Sakshi News home page

ఇంద్రధనస్సుతో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం

Published Sat, May 9 2015 6:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

చుక్కలు వేస్తున్న దృశ్యం

చుక్కలు వేస్తున్న దృశ్యం

జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం కల్గించే రెండవ రౌండ్ చుక్కల మందు కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ సలావుద్దీన్ ప్రారంభించారు

బళ్లారి అర్బన్ :జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం కల్గించే రెండవ రౌండ్ చుక్కల మందు కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ సలావుద్దీన్ ప్రారంభించారు. శుక్రవారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో జిల్లా ఆరోగ్య, కుటుంబ కల్యాణ శాఖ ఆధ్వర్యంలో రెండవ రౌండ్ ఇంద్రధనస్సు విశేష కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరు పోలియో చుక్కలను తప్పని సరిగా వేయించాలన్నారు. ప్రతి ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పోలియో చుక్కలను వేయించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలు రాకుండా చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందకు వీలవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏడు తాలూకాలలో నాలుగు రౌండ్ల చొప్పున  ప్రతి నెల ఏడు రోజుల పాటు నిర్వహిస్తారని తెలిపారు. పుట్టిన రెండు సంవత్సరాల లోపు వయస్సుగల చిన్నారికి ఏడు రకాల రోగాల నివారణకు, గర్భిణీ లు మొదటి నుంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లి పాలను పట్టించడంతో వారు ఆరోగ్యం ఉంటారని తెలిపారు. జిల్లాలో మొత్తం 1269 ప్రాంతాలలో గుర్తించి అందులో 7048 పిల్లలకు, 896 మంది గర్భిణీలకు ఈ చుక్కలను వేసినట్లు తెలిపారు. ఇందులో 530 చుక్కల కేంద్రాలను, 75 సంచార గ్రూపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ ఖాజీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం  284 మంది సిబ్బంది, సూపర్‌వైజర్లు, తాలూకాలోని ఒక నోడల్ అధికారి పాల్గొనారని తెలిపారు. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలో, ఇంటింటికి వెళ్లి ఈ చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాలలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సమక్షంలో ఈ చుక్కల కార్యక్రమాన్ని చే పట్టారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఇంద్రాణి, డీహెచ్‌ఓ రమేష్‌బాబు, జిల్లా శస్త్రచికిత్స వైద్యులు ఎన్.బసరెడ్డి, తాలూకా ఆరోగ్యాధికారి వీరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement