సాక్షి, హైదరాబాద్: పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 27న (ఆదివారం) పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 0–5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడిం చారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
తర్వాత రెండు రోజులపాటు (సోమవారం, మంగళవారం) సిబ్బంది ఇంటింటికీ తిరిగి, ఇంకా ఎవరైనా వేసుకోనివారు ఉంటే గుర్తించి పోలియో చుక్కలు వేస్తారన్నారు. మొత్తం 38 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని వైద్యా రోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ సెం టర్లు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టు లు, పర్యాటకప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment