జిల్లాలో 95.01 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు
ఎంజీఎం : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. 95.01 శాతం మంది చిన్నారులకు చుక్కల మందులు వేరుుంచారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వాకాటి కరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. పోలియో వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు విధిగా పోలి యో చుక్కలు వేరుుంచాలని సూచించారు. కలెక్టర్ కరుణ మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్పారు.
నగరంతో పాటు జిల్లాలోని 51 మం డలాల్లో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరి యా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు, 5 మున్సిపల్ కార్పొరేషన్‌లు, 75 మున్సిపాలిటీ లు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.జిల్లాలోని ఐదేళ్లలోపు4,52,019 మం దికి పోలియో చుక్కలు వేసేందుకు 34,110 వాయిల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 16,066 మంది సిబ్బందిని నియమించామని, 1384 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో రీజినల్ డెరైక్టర్ నాగేశ్వర్‌రావు, వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు, మున్సిపల్ ఉపకమిషనర్ షామిద్ మసూద్, డీఐఓ హరీశ్‌రాజు, ఎంహెచ్‌ఓ జయప్రకాశ్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ శ్రీరాం, ఎస్‌ఎంఓ కిరణ్, రెడ్‌క్రాస్ చైర్మన్ రవీందర్‌రావు, డీపీహెచ్‌ఎన్‌ఓ వెంకటమ్మ పాల్గొన్నారు.
95.01 శాతం నమోదు..
జిల్లా వ్యాప్తంగా 4,05,219 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు ఏర్పాట్లు చేయగా 3,85, 282 మందికి వేసినట్లు డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీఐఓ హరీశ్‌రాజు తెలిపారు. మొత్తంగా 95.01 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశామన్నారు.
పోలియోరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : ఆర్డీ
రెండు చుక్కల పోలియో మందుతో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డెరైక్టర్ నాగేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలోని ఓపీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వరంగల్‌ను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయూలని కోరారు.
పల్స్ పోలియో సక్సెస్
Published Mon, Jan 18 2016 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement