ఏసీబీకి చిక్కి.. మనస్తాపంతో ఈఈ ఆత్మహత‍్య | executive engineer committed suicide in nizamabad district | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కి.. మనస్తాపంతో ఈఈ ఆత్మహత‍్య

Published Sat, Jan 21 2017 6:53 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీకి చిక్కి.. మనస్తాపంతో ఈఈ ఆత్మహత‍్య - Sakshi

ఏసీబీకి చిక్కి.. మనస్తాపంతో ఈఈ ఆత్మహత‍్య

నిజామాబాద్‌: అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డానని మనస్తాపానికి గురై ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ)గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు శనివారం ఉదయం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఈ సంఘటనతో మనస్తాపం చెందిన ఆయన సాయంత్రం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ఓ వ్యక్తి వద్ద రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఈఈని పట్టుకున్నారు. అయితే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఏసీబీ అధికారుల తీరును నిరసిస్తూ ఏసీబీ డీఎస్పీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ ఉద్యోగులు ఆస్పత్రిని ముట్టడించారు. ఏసీబీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement