రెండు బైక్ లుఢీ కొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ ప్రాంతంలో పెట్రోల్ పంపు వద్ద రెండు బైక్‌లు ఢీ కొట్టి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పట్టణంలోని షాపూర్‌నగర్‌కు చెందిన వైద్యపు వెంకటేశ్వర్లు (60) శనివారం ఉదయం బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందాడు.