మిస్టరీని ఛేదించిన పోలీసులు
కన్నకొడుకే సూత్రధారి
నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
దుగ్గొండి : ఆస్తి పంచి ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్న ఓ వ్యక్తి కన్నతండ్రినే హత్య చేరుుంచాడు. సుఫారీ ఇచ్చి కిరాయి రౌడీలతో మట్టుబెట్టించాడు. మండలంలోని గిర్నిబావిలో ఇటీవల జరిగిన ఆర్‌ఎంపీ గడుదాసు వెంకటేశ్వర్లు హత్య కేసులో హతుడి కుమారుడు, అతడి మిత్రుడు, ఇద్దరు కిరాయి రౌడీలను పోలీ సులు అరెస్ట్ చేసి కేసు మిస్టరీని ఛేదించారు. నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్ కథంన ప్రకారం.. మండలంలోని గిర్నిబావి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ గడుదాసు వెంకటేశ్వర్లు(75) స్థాని కంగా గత 45 ఏళ్లుగా ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఆయనకు కుమారులు నమస్కారం అలియూస్ శ్రీను, నమస్తే అలి యూస్ రవి, కుమార్తెలు ప్రతిజ్ఞ, ప్రార్థన ఉన్నారు. ఆయన స్థాని కంగా నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి వెంట విలువైన ఆస్తులు సంపాదించాడు. ఆస్తి పంచాలని కుమారులు కొన్నాళ్లుగా అడిగినా పంచిఇవ్వడం లేదు. దీంతో చిన్నకుమారుడు గడుదాసు నమస్తే అలియాస్ రవి హత్య చేయడానికి పథక రచన చేశాడు.
ఎంజీఎంలో పథక రచన.. గిర్నిబావిలో హత్య
కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నమస్తే ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అతడి చికిత్సకు తండ్రి డబ్బులు ఇవ్వలేదు. అప్పటికే నమస్తేకు సంగెం మండలం గుంటూరుపల్లికి చెందిన అతడి మిత్రుడు శాఖమూరి రమేష్‌బాబు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అసలు, వడ్డీ కలిపి రూ.6 లక్షలకు చేరింది. దీంతోపాటు అప్పులు పెరిగిపోయూరుు. తండ్రి ఆస్తి ఇవ్వడం లేదు. దీంతో ఎలాగైనా తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వచ్చిన తన మిత్రుడు రమేష్‌బాబు, తన తండ్రికి పరిచయస్తుడు అయిన గిర్నిబావి గ్రామానికి చెందిన రాయపురి రాజుతో మంతనాలు జరిపాడు. రూ.8 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారు. రాయపురి రాజుకు రమేష్‌బాబు రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. వెంకటేశ్వర్లుతో రాజు మాట్లాడడానికి ఓ బినామీ వ్యక్తి పేరున సిమ్ కార్డు, ఓ ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి రాయపురి రాజు గడుదాసు వెంకటేశ్వర్లుతో స్నేహం చేశాడు. 10 తులాల దొంగ బంగారం రూ.2 లక్షలకే ఇస్తానని వెంకటేశ్వర్లు చెప్పడంతో బయానాగా అతడికి కొంతడబ్బు ఇచ్చి రాజు నమ్మించాడు.
ఇలా స్నేహం కొనసాగుతున్న క్రమంలో మే 19న రాయపురి రాజు గీసుగొండ మండల ఎలుకుర్తి గ్రామానికి చెందిన తన బాబాయి రాయపురి జనార్దన్‌కు ఇంటికి రమ్మని ఫోన్ చేశాడు. 20న జనార్దన్ రావడంతో విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి వెంకటేశ్వర్లును చంపాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రూ.20 వేలు ఇచ్చే వ్యక్తి వచ్చాడని స్థానికంగా ఉన్న పాఠశాలకు రావాలని రాజు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేయడంతో వె ంకటేశ్వర్లు వెళ్లాడు. ముగ్గురు మద్యం తాగారు. అనంతరం రాజు ముందుగానే సిద్ధం చేసుకున్న గునపంలాంటి రాడుతో వెంకటేశ్వర్లు మెడపై కొట్టాడు. అతడు కిందిపడిపోవడంతో ప్రాణం పోయేంతవరకు చాతిభాగంపై కొట్టాడు. మరణించాడని నిర్ధారించుకున్న అనంతరం ఖమ్మం రోడ్డు వద్దకు వెళ్లి రమేష్‌బాబుకు సమాచారమిచ్చాడు. అతడు వచ్చి రూ.25 వేలు ఇవ్వగా అందులో రూ.5 వేలు బాబాయి జనార్దన్‌కు ఇచ్చి పంపాడు. సిమ్‌కార్డును విరిచి దేశాయిపేట బ్యాంక్ సమీపంలో పడేసి, చెత్త కుప్పలో ఫోన్ విసిరేశాడు.
తొలుత మిస్సింగ్ కేసు నమోదు..
ఇంట్లో నుంచి వెళ్లిన వెంకటేశ్వర్లు తిరిగి రాకపోవడంతో మే 25న అతడి కూతురు తుమ్మ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై నల్లగట్ల వెంకటేశ్వర్లు దర్యాప్తులో భాగంగా మే 27న వందన గార్డెన్ సమీపంలోని ముళ్ల చెట్ల మధ్యన గడుదాసు వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కనుగొన్నారు. చంపి ఏడు రోజులు కావడంతో శవం పూర్తిగా ఎండిపోయింది. నిందితుడి ఫోన్ కాల్ లిస్టు. డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం నిందితుల వివరాలు సేకరించారు. దీంతో గిర్నిబావిలో ఓ వ్యక్తి సమక్షంలో శుక్రవారం ఉదయం నిందితులు లొంగిపోయారని సీఐ వివరించారు. నిందితులు రాయపురి రాజు, రాయపురి జనార్దన్, గుడుదాసు నమస్తే, శాఖమూరి రమేష్‌బాబును అరెస్టు చేసి, 25 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
ఆర్‌ఎంపీది సుపారీ హత్య
Published Fri, Jun 3 2016 11:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement