భర్తను చితకబాదిన భార్య | wife beat her husband | Sakshi
Sakshi News home page

భర్తను చితకబాదిన భార్య

Published Wed, Oct 8 2014 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

భర్తను చితకబాదిన భార్య - Sakshi

భర్తను చితకబాదిన భార్య

నేలకొండపల్లి :  తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహించిన భార్య, బంధువులతో కలిసి అతడిని చితకబాది పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం... జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలోని జూపెడకు చెందిన ఎలక వెంకటేశ్వర్లుకు నల్లగొండ జిల్లా మోతే మండలంలోని రాయిపాడు గ్రామానికి చెందిన పప్పుల రాజారావు కూతురు రమణతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

అయితే వెంకటేశ్వర్లు బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో కొద్ది  రోజులుగా వీఆర్‌ఓగా పనిచేస్తున్నాడు. కాగా, నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళతో అతడు కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఇటీవల నల్లగొండ జిల్లా మోతే పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ  వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోపాటు రెండు నెలల నుంచి ఇంటికి రావడంలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు భార్య రమణ మంగళవారం తన ఇద్దరు పిల్లలు, బంధువులతో కలిసి చెన్నారం గ్రామానికి వచ్చారు. అనంతరం భర్త వెంకటేశ్వర్లుతోపాటు అతడితో ఉన్న మహిళను వారు చితకబాది పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓ బాలస్వామి.. వెంకటేశ్వర్లు, అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement