‘‘ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతమైన పాటలు, సంగీతం అందిస్తున్నారు. అయితే ఓ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్‌కు ఎక్కడో చిన్న గ్యాప్ ఉందనిపిస్తోంది. ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కొన్ని కొత్త ఐడియాస్ ఉన్నాయి. మంచి కథ, హీరో, దర్శక–నిర్మాతలు, సరైన సమయం... ఇలా అన్నీ కుదిరితే కచ్చితంగా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు
సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల. వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది.సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల దాదాపు పన్నెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టు..’ పాటను పాడారు. ఈ సందర్భంగా రమణ గోగుల చెప్పిన విశేషాలు.
⇒ వెంకటేశ్‌గారి ‘ప్రేమంటే ఇదేరా..’ సినిమాతో సంగీత దర్శకుడిగా నా కెరీర్ మొదలైంది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత వెంకటేశ్‌గారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని పాటతో తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను. ఇదంతా చూస్తుంటే లైఫ్ ఫుల్ సర్కిల్ అవ్వడం ఇదేనేమో అనిపిస్తోంది. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఫోన్ చేసి, ‘గోదారి గట్టు..’ పాట పాడాలని కోరారు. నేనేమో ఇప్పటివరకు వేరే సంగీత దర్శకుల పాటలను పాడింది లేదు.
సరే... ఓసారి పాట విందామని విన్నాను. చాలా నచ్చింది. పాటలో ఓ హార్ట్ ఉందనిపించి, ఒప్పుకున్నాను. మధుప్రియ నాతో కలిసి చాలా బ్యాలెన్సింగ్‌గా పాడారు. భాస్కరభట్లగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, భీమ్స్ ఈ పాట పాడేందుకు నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. వెంకటేశ్‌గారు నాకు లవ్లీ ఫ్రెండ్. ఆయన ఫోన్ చేసి, అభినందించారు. పాట రిలీజైన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎవరో ఓ వ్యక్తి మాది గుంటూరు అంటూ ఫోన్ చేసి, ‘గోదారి..’ పాట బాగుందని మాట్లాడాడు. చాలా హ్యాపీ ఫీలయ్యాను.
⇒ నాకు మ్యూజిక్‌తో పాటు టెక్నాలజీ అంటే ఇష్టం. దీంతో అబ్రాడ్‌లో ఓ మల్టీనేషనల్ కంపెనీకి వర్క్ చేశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డాటా ఎనలిటిక్స్ వంటి అంశాలపై పని చేశాను. అలాగని సంగీతానికి దూరంగా లేను. నాకు ఇష్టమైనప్పుడు మా ఇంట్లో పియానోను, గిటార్‌ను ప్లే చేస్తూనే ఉంటాను. ఏఐతో సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ హ్యూమన్ టచ్ ఉన్నప్పుడే సాంగ్స్ బాగుంటాయి. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ గ్యాప్‌లో దాదాపు వంద సినిమాలు రిజెక్ట్ చేసి ఉంటాను. నాకు ఇష్టం అయితేనే సాంగ్స్ కంపోజ్ చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment