bonakal mandal
-
పాము కాటుకి నాటు కోడి వైద్యం, ఒక్క ప్రాణం పోలేదు.. ఎక్కడంటే..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని బోనకల్ మండలం కలకోట గ్రామంలో పాము కాటు గురైన వారు నాటు కోడి వైద్యం చేయించుకోవడం తాజాగా వైరల్గా మారింది. కలకోట గ్రామానికి చెందిన తోటపల్లి సురేష్ పదేళ్ల నుంచి నాటుకోడి వైద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాము కాటు గురైన 300 మందికి నాటు కోడి వైద్యం చేశాడు. అయితే పాముకాటుకి కోడి వైద్యం చేయడం వల్ల ఎవరూ కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆయన చెబుతున్నారు. పాము కాటు గురైన వారు గంటన్నరలోపు వస్తేనే లాభం ఉంటుందని అంటున్నారు. కాగా పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని కోడి చనిపోతుంది. అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే వరకు గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే కోడి చనిపోవడం ఆగిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగిపోయినట్లు లెక్కిస్తారు. కాటు వేసిన పాము తీవ్రతను బట్టి 5 నుంచి 15 కోళ్ల వరకు విషం తీయడానికి ఉపయోగిస్తుంటారు. చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో పాము కాటు గురైన వారు నాటుకోడి వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. చదవండి: నార్సింగిలో బైక్ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి వైద్యుల హెచ్చరిక మరోవైపు వైద్యులు మాత్రం నాటు వైద్యాన్ని విశ్వసించరాదని సూచిస్తున్నారు. నాటు కోడి వైద్యంతో సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాలమీదకు కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. పాము కాటుకి గురైతే బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని చెప్తున్నారు. చదవండి: కోరుకున్న ఉద్యోగం రాలేదు, ఏజెన్సీ మోసం.. రెండు నెలలుగా.. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో సెల్ఫీ వీడియో తీసుకుని
బోనకల్: మండలంలోని చిరునోముల గ్రామంలో మంగళవారం రాత్రి తన ప్రియుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని మనస్తాపంతో ప్రియురాలు శానిటైజర్ తాగి ఆత్మాహత్యాయత్నం చేసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పారా సింధు రావినూతలకు చెందిన పర్సగాని వేణు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తనను శారీరకంగా లొంగదీసుకొని పెళ్లి చేసుకోకుండా మొహం చాటేస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో పది రోజుల కిందట వేణుపై సింధు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని ఇప్పటికే రెండు సార్లు ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శానిటైజర్ తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సింధును కుటుంబ సభ్యులు రావినూతలలో ఉన్న ప్రియుడి ఇంటి ఎదుట వదిలేశారు. దళితురాలైనందున తనను పెళ్లి చేసుకునేందుకు ప్రియుడి తల్లిదండ్రులకు ఇష్టం లేదని అందుకు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
భర్తను చితకబాదిన భార్య
నేలకొండపల్లి : తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహించిన భార్య, బంధువులతో కలిసి అతడిని చితకబాది పోలీస్స్టేషన్లో అప్పగించింది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం... జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలోని జూపెడకు చెందిన ఎలక వెంకటేశ్వర్లుకు నల్లగొండ జిల్లా మోతే మండలంలోని రాయిపాడు గ్రామానికి చెందిన పప్పుల రాజారావు కూతురు రమణతో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లు బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామంలో కొద్ది రోజులుగా వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. కాగా, నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళతో అతడు కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఇటీవల నల్లగొండ జిల్లా మోతే పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోపాటు రెండు నెలల నుంచి ఇంటికి రావడంలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు భార్య రమణ మంగళవారం తన ఇద్దరు పిల్లలు, బంధువులతో కలిసి చెన్నారం గ్రామానికి వచ్చారు. అనంతరం భర్త వెంకటేశ్వర్లుతోపాటు అతడితో ఉన్న మహిళను వారు చితకబాది పోలీసుస్టేషన్లో అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి ఎస్హెచ్ఓ బాలస్వామి.. వెంకటేశ్వర్లు, అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదుచేశారు.