లారీ ఢీ కొని ఆర్ఎంపీ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గోవిదరావుపేట మండల శివారులో చోటుచేసుకుంది. పసర గ్రామానికి చెందిన చిట్టిమల్ల వెంకటేశ్వర్లు(56) ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. మంత్రి చందూలాల్, చల్వాయిలో పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తుండగా అక్కడకు వెళ్లాడు.
గోవిదరావుపేటకు వచ్చేక్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వెంకటేశ్వర్లును ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడిక్కక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని మునుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.