ఉన్నతాధికారి వేధింపులు తాళలేక విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కొత్తపేట: ఉన్నతాధికారి వేధింపులు తాళలేక విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు గురువారం ఉదయం డ్యూటీలో ఉండగానే నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన తోటి పోలీసులు చికిత్స నిమిత్తం కానిస్టేబుల్‌ను జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీఐ శ్రీకాంత్ వేధిపుల వల్లే వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.