మణుగూరు : మణుగూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి ఫోన్‌లో సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైబల్ వెల్పేర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దృష్టికి నియోకవర్గ సమస్యలను తీసుకెళ్లినట్లు తెలిపారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయూలని, నియోజకవర్గంలోని పులుసుబొంత ప్రాజెక్టు కిన్నెరసాని కాలువ పనులకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేయాలని కోరామని చెప్పారు.
11ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన పూర్తిచేయా ని, చెరువులు, కుంటలకు మరమ్మతులు చే యూలని, గిరిజన బాలికల రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరి నట్టు వివరించారు. పీహెచ్‌సీలో సిబ్బంది ని నియమించాలని, గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మిం చాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరామని తెలిపారు. మణుగూరు పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీలో ఖాళీలను భర్తీ చేయూలని కోరినట్లు చెప్పారు. ఈ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పం దించారని తెలిపారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.
మణుగూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయూలి
Published Sun, Oct 19 2014 2:47 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement
Advertisement