- మత్స్యకార్మికుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్లు
దుబ్బాక రూరల్: వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండితేనే మత్స్య కార్మికులకు ఉపాధి లభిస్తుందని జాతీయ మత్స్యకార్మికుల సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కురిసిన వర్షాలకు దుబ్బాకలోని పెద్ద చెరువు, రామసముద్రం చెరువులలోనికి కొంత మేరకు నీళ్లు చేరుకున్నాయి.
చెరువులను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెరువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మిషన్‌కాకతీయ ద్వారా అభివృద్ది చేశారన్నారు. చెరువులు నిండితే మత్స్య కార్మిలకులే కాకుండా రైతులు కూడా సుఖసంతోషాలతో జీవిస్తారన్నారు. చెరువు ఊరికి తల్లి లాంటిదన్నారు. చెరువులు నిండితే మత్స్య కార్మికులు వలస బాట పట్టకుండా సొంత ఊర్లోనే ఉపాధి లభిస్తుందన్నారు.
సీఎం కేసిఆర్ పాలన బంగారు తెలంగాణాకు బాటలు వేస్తోంన్నారు. కురుసిన వర్షాలకు చెరువులకు నీరు చేరడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ భోగేశ్వర్, టీఆర్‌ఎస్ నాయకులు గన్నె భూంరెడ్డి తదతరులు పాల్గొన్నారు.