మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : మంచిర్యాల హైటెక్ సిటీలోని మంచిర్యాల క్లబ్‌పై మంగళవారం రాత్రి పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా 36 మందిని అరెస్టు చేయగా.. వారి నుంచి రూ.4 లక్షలు, 22 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. క్లబ్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్సైలు లతీఫ్, వెంకటేశ్వర్లు, సంజీవ్ సిబ్బందితో కలిసి క్లబ్‌పై దాడి చే శారు. ఆ సమయంలో ఆరు గదుల్లో పేకాట ఆడుతూ కనిపించారు. పారిపోయే క్రమంలో 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు.
ఈ సందర్భంగా 22 సెల్‌ఫోన్లు, రూ.4 లక్షలు నగదు, ఫర్నిచర్, కైన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో రాజన్న, వెంకటేశ్‌గౌడ్, అంజిత్‌రావు, ఎండీ అన్వర్, ఎస్.జగన్, రామడుగు సుధీర్, కట్కూరి మల్లేశ్, బలమూరి కిషన్‌రావు, బేర పోచయ్య, గౌరీ వెంకటరమణ, ఎస్.సత్యనారాయణ, ఎండీ ఖాజా, కొత్త రవీందర్, చిలువేరు నాగేశ్వర్‌రావు, కళ్యాణ్, యాదగిరిరావు, సురేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, భీమయ్య, నర్సింగారావు, మనోహర్‌రావు, చంద్రయ్య, నవీన్‌కుమార్, నునారపు రాజలింగు, పాపారావు, శ్రీనివాస్, ఎస్.వెంకటేశ్వర్‌రావు, బి.అనిల్, పూర్ణచందర్, రాజేందర్‌గౌడ్, జి.నరేందర్, లక్ష్మీమనోహర్‌రావు, సానా సత్తయ్య, వి.శ్రీనివాసరావు, బెల్లంకొండ భూమారెడ్డి, యం.రవీందర్‌రావు ఉన్నారు.
క్లబ్ పై దాడి
Published Wed, Mar 12 2014 2:40 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement