తుర్కపల్లి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలోని గంగోత్రి ఎరువుల కర్మాగారంలో అమ్ముతున్న సీఎంఎస్ బస్తాలు డీఏపీ ఎరువులకు ప్రత్యామ్నా యం కాదని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు. గంగోత్రి ఎరువుల కర్మాగారంపై డీసీసీబీ డెరైక్టర్ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం కర్మాగారంలో విచారణ చేపట్టారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐశ్వర్య సీఎంఎస్ పేరుతో అమ్ముతున్న ఎరువుల బస్తాల్లో కాల్షి యం, మెగ్నిషియం, సల్ఫర్‌లు ఉన్నాయని, డీఏపీలో ఉండే భాస్వరం లేదని తెలిపారు.
గతంలో గంగోత్రి కర్మాగారం లో కొనుగోలు చేసిన ఐశ్వర్య సీఎంఎస్ ఎరువులు డీఏపీ అని వాడి నష్టపోవద్దని సూచించారు. ఐశ్వర్య సీఎంఎస్ ఎరువులు చౌడునేలలో పనిచేస్తాయని, పంటలకు సీఎంఎస్ ఎరువులు భూములకు సూక్ష్మపోషకాలివ్వవని తెలిపారు. కొనుగోలు చేసిన రైతులు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని సూచించారు. గంగోత్రి యాజమాన్యం సీఎంస్ బస్తాలు రిటేలుగా కొనుగోలు చేయడం సరికాదన్నారు. గంగోత్రి యజమాన్యానికి సీఎంఎస్ ఎరువులను తయారు చేయడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
రిటేల్ అమ్మకాలు కొనసాగించం
కొందరు రైతులు కావాలని సీఎంఎస్ ఎరువులు తీసుకెళ్లారని గంగోత్రి ఎరువుల కర్మగారం మేనేజింగ్ డెరైక్టర్ మధురాంరెడ్డి తెలిపారు. కంపెనీ ఎటువంటి రిటేల్ అమ్మకాలు కొనసాగించదని తెలి పారు. సీఎంఎస్ ఎరువులు డీఏపీ అని వాడి నష్టపోకుండా వ్యవసాయశాఖ అధ్వర్యంలో మండలంలో సీఎంఎస్ ఎరువులపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
రైతులు మోసపోవద్దు
గంగోత్రి ఎరువుల కర్మాగారంలో కొనుగోలు చేసిన ఐశ్వర్య సీఎంఎస్ ఎరువులు వాడి డీఏపీ ఎరువులు అనుకొని మోసపోవద్దని డీసీసీబీ డెరైక్టర్ పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. గంగోత్రి ఎరువుల కర్మగారం రైతులకు అవగాహన కల్పించకుండా సీఎంఎస్ ఎరువు లు అంటగట్టారని ఆరోపించారు. విచారణలో ఏఓ శిల్ప పాల్గొన్నారు.
గంగోత్రి ఎరువుల కర్మాగారంపై విచారణ
Published Mon, Dec 23 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement